Praja Kshetram
సినిమా న్యూస్

అడ్డంగా దొరికిన హేమ.. డ్రగ్స్ తీసుకున్నట్టు టెస్ట్‌లో నిర్దారణ.!

అడ్డంగా దొరికిన హేమ.. డ్రగ్స్ తీసుకున్నట్టు టెస్ట్‌లో నిర్దారణ.!

 

బెంగళూరు మే 23 (ప్రజాక్షేత్రం): రేవ్ పార్టీ కేసు రోజురోజుకు కొత్త మలుపులు తిరుగుతుంది. ఇప్ప‌టికే ఈ రేవ్ పార్టీలో టాలీవుడ్ సినీ నటి హేమతో పాటు ప‌లువురు సినీ ప్ర‌ముఖులు ఉన్న‌ట్లు బెంగ‌ళూరు పోలీసులు ప్ర‌క‌టించిన విష‌యం తెలిసిందే. అయితే పోలీసులు ప్ర‌క‌టించిన కాసేప‌టికే హేమ త‌న‌కు ఆ పార్టీకి ఎటువంటి సంబంధం లేదంటూ వీడియో విడుద‌ల చేసింది. అయితే ఈ వీడియో విడుద‌ల చేయ‌డం వ‌ల‌న బెంగళూరు పోలీసుల‌కు ఆధారం దొరికిన‌ట్ల‌యింది. రేవ్ పార్టీలో ఉన్న వీడియో.. హేమ విడుద‌ల చేసిన వీడియో ఒకేలా ఉండ‌డంతో పోలీసులు హేమని అదుపులోకి తీసుకున్నారు.తాజాగా పోలీసుల విచార‌ణలో భాగంగా హేమకి డ్రగ్స్ టెస్ట్ నిర్వ‌హించ‌గా.. రేవ్ పార్టీలో హేమ డ్రగ్స్ తీసుకున్న‌ట్లు అడ్డంగా దొరికిపోయింది. డ్రగ్స్ టెస్ట్‌లో హేమకి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు తెలిపారు. హేమ‌తో పాటు డ్రగ్స్ టెస్ట్‌లో మొత్తం 86 మందికి పాజిటివ్ వచ్చినట్లు పోలీసులు ప్ర‌క‌టించారు. హేమను బాధితురాలుగా పరిగణించే అవకాశముంది. హేమను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చే అవకాశముందని సమాచారం. ఇక ఈ సంఘటనపై మ‌రిన్ని వివరాలు తెలియాల్సిఉంది.

Related posts