Praja Kshetram
తెలంగాణ

ప్రభుత్వ భూమిలో నుండి వెంచర్ ఏర్పాటుకు అక్రమంగా మట్టి తరలింపు.

ఎకర ప్రభుత్వ భూమి కబ్జా చేసిన భూ బకాసురుడు.

మునిదేవునిపల్లి ప్రభుత్వ భూమి సర్వే నెంబర్ 92.

రిద్ధి హాబిటాట్స్ ఎల్.ఎల్.బి పేరున వెంచర్.

గ్రామపంచాయతీలు అనుమతులు లేకుండానే పనులు.

హిటాచి టిప్పర్రా సహాయంతో గుట్టను కతం చేశారు.

 

 

కొండాపూర్ మే 23 (ప్రజాక్షేత్రం):అక్రమ వెంచర్ల నిర్మాణాలకు కేరాఫ్ అడ్డగా కొండాపూర్ మండలం మన్సాన్పల్లి,ముని దేవునిపల్లి గ్రామాలు అడ్డాగా మారాయి. ముని దేవునిపల్లి ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 92లో నుండి సర్వేనెంబర్ 85, 86 పట్టా మన్సాన్పల్లి గ్రామ సర్వేనెంబర్ 196,194 మొత్తం 18 ఎకరాల్లో పట్టా భూమి హైదరాబాద్ కు చెందిన రిద్ధి హాబిటాట్స్ ఎల్.ఎల్.బి, కే. శారద వెంకట భూ యజమానులు ఎలాంటి అనుమతి లేకుండా ప్రభుత్వ భూమి మునిదేవుని పల్లి గ్రామ సర్వేనెంబర్ 92 లో నుండి దాదాపు రెండు ఎకరాల పెద్దగుట్టను హిటాచి టిప్పర్ల సహాయంతో గుట్టను మూడు నెలల నుండి తవ్వేసి తమ పట్టా భూముల వెంచర్ నిర్మాణం కొరకు ఎర్రమట్టిని వాడుకున్నారు. వెంచర్ నిర్మాణానికి గ్రామ పంచాయతీల అనుమతులు లేకున్నా రోడ్లు ఏర్పాటు చేశారు. ప్రభుత్వం భూమిలో నుండి అక్రమంగా అనుమతులు లేకుండా మట్టిని వెంచర్ పనులకు వాడుకున్నందుకు సంబంధిత మండల తాసిల్దార్, ఆర్డీవో జిల్లా కలెక్టర్ స్పందించి అక్రమాల కు పాల్పడ్డ వారిపై తగు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు.

*సైలెంట్ గా ఉన్న ఇరిగేషన్ అధికారులు*

ప్రభుత్వ భూముల నుండి పట్టా భూంలోకి మట్టి తరలించేందుకు వాగు అడ్డం ఉండడంతో రెండు నలాలపై తాత్కాలికంగా రెండు పైపులు వేసి రహదారిగా చేసుకొని యధావిధిగా ఆ నాలా పైనుండిమట్టి తరలిస్తున్నారు.వచ్చేది వర్షాకాలం అని తెలిసిన ఇరిగేషన్ అధికారులు మాత్రం నామమాత్రంగా వేసిన పైపులను ఎందుకు తీసివేయడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇచ్చిన చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారు ఇకపై నిర్లక్ష్యం వీడి తాత్కాలికంగా వేసిన పైపులను ఇకనైనా చూసి చేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

*గ్రామపంచాయతీ సెక్రటరీల నిర్లక్ష్యం ఎందుకు?*

గ్రామపంచాయతీల అనుమతి లేకుండా వెంచర్ ఏర్పాటు చేస్తుంటే రోజు గ్రామాలకు వచ్చే పంచాయతీ సెక్రటరీలు గ్రామపంచాయతీ అనుమతులు లేకుండా పనులు కొనసాగిస్తున్న వారికి నోటీసులు ఇవ్వకుండాఏం చేస్తున్నారు.ఇకనైనా నిర్లక్ష్యం వీడి అనుమతులు లేకుండా అక్రమ వెంచర్ ఏర్పాటు చేస్తున్న వారికి నోటీసులు ఇచ్చి పనులు నిలిపివేయాలని గ్రామస్తులు కోరుతున్నారు.

Related posts