అడ్డు లేదు అనుమతి లేదు ఈ అక్రమ నిర్మాణలకు
– నేను చూడలేదు అంటున్న పంచాయితీ కార్యదర్శి
– నోటీసులు జారీ చేస్తామన్నా పంచాయితీ కార్యదర్శి
– ఈ నిర్మాణాలకు ఎవ్వరి అండతో నిర్మిస్తున్నారు..?
– స్థానికుల అనుమతులకు మొండి చేయి చూపిస్తున్న పంచాయతి కార్యదర్శి
– అక్రమ నిర్మాణాల పై వరుస కథనాలు..
మొయినాబాద్ మే 23 (ప్రజాక్షేత్రం): మండలంలోని నాగిరెడ్డి గూడ గ్రామ రెవెన్యూ పరిధి లో ఉన్న కంట్రీ సైడు వెంచరులో మరియు సర్వే నెంబర్ 25, 26 లో జరగుతున్న ఈ నిర్మాణలు ఏ మాత్రం నిబంధనలు పాటించకుండా నిర్మాణాలు జరగుతున్న అధికారులు చూసి చూడనట్టు వ్యవరిస్తున్నారు. కానీ స్థానికులకు ఇంటి అనుమతులు ,ఇంటి నెంబర్ ఇవ్వడానికి నిరాకరిస్తున్న పంచాయితీ కార్యదర్శి అయితే ఇక్కడ పేరుకు 111 జీవో నిబంధనలు ఉన్నవి. జరిగే పనులు అడ్డు లేకుండా అనుమతి లేకుండా జర్గుతున్నాయి. వెంటనే గ్రామ పంచాయతీ కార్యదర్శి, నోటీసులు జారీ చేస్తామని తెలిపారు.
ఈ అక్రమ కట్టడాలపై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో లేదో వేచి చూడాలి.