Praja Kshetram
తెలంగాణ

గలీజైతున్న గండిపేటా…

గలీజైతున్న గండిపేటా…

— 111 జీ ఓ కు తూట్లు
— కలుషితం అవుతున్న త్రాగు నీరు
— హిమాయత్ నగర్ గ్రామం నుండి గండిపేట చెరువులోకి పారుతున్న మురికి నీరు
—కనిపించని గ్రీన్ ట్రిబ్యునల్ సభ్యులు
— డంపింగ్ యార్డ్ ను తలపిస్తున్న గండిపేట కట్ట

మొయినాబాద్ మే 23 (ప్రజాక్షేత్రం):
మొయినాబాద్ మండలంలోని హిమాయత్ నగర్ గ్రామానికి ఆనుకొని ఉన్న గండిపేట చెరువులోకి మురికి నీరు ప్రవహిస్తుంది అయినప్పటికి ఎవ్వరు పట్టించుకోకపోవడం గమనార్హం. జంట జలశయాలనులను కాపాడుకోవాలని 1996లో 1.32 ఎకరాల వ్యవసాయ భూమిని 111 జీ ఓ పరిధిలోకి తెచ్చారు తద్వారా ఆ స్థలాలలో ఎటువంటి అభివృద్ధి కార్యక్రమాలు జరుపకూడదు అని నియమం తెచ్చారు. అప్పుడే జంట జలశయాలు అయినా ఉస్మాన్ సాగర్ మరియు హిమాయత్ సాగర్ నీటిని నగరంలోని ప్రజలకు స్వచ్ఛమైన నీరు అందించాలని ఆలోచించారు.84 గ్రామాల ప్రజలు ఎంత ఇబ్బంది పడుతున్న ఈ జంట జలశయాల కొరకు ఊరుకున్నారు. కానీ అలాంటి నీరే ఇప్పుడు కలుషితం అవుతున్న ఎవ్వరు పట్టించుకోవడం లేదు, అసలు చెరువు వైపు వెళ్లి ఏం జరుగుతుందో కుడా తెలుసుకోవడం లేదు, చెరువు రెండు వైపులా మురికి మరియు చెత్త తో నిండిపోయింది పరీక్షించి చూస్తే చెరువు కట్ట డంపింగ్ యార్డ్ ను తలపిస్తుంది. గ్రామం నుండి వ్యర్థం కాలువ లాగా ఏర్పడి మురికి మొత్తం చెరువులోకి చేరుతుంది, నగరానికి త్రాగు నీరు అందించే అమృత జలశయాలను మురికి కాకుండా వారికి మంచి నీరు అందించాలని ముందు ఇంకా వచ్చేది వర్షాకాలం కావున వరద ఎక్కువగా పొర్లుతుంది కావున ముందే చర్యలు తీసుకొని చెరువులోకి వ్యర్థం చేరకుండా చూడాలని ప్రజలు కోరుతున్నారు. ఇట్టి విషయమై పలు మార్లు కార్యదర్శి కి విన్నవించుకున్న స్పందించకపోవడం విడ్డురం అని స్థానికులు అంటున్నారు.

Related posts