Praja Kshetram
తెలంగాణ

ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నా పోలీసులు

దాడి చేసిన కానిస్టేబుల్ సత్తార్ ను వెంటనే సస్పెండ్ చేయాలి

ప్రజలకు రక్షణగా ఉండాల్సిన పోలీసులే ప్రజలను ఇబ్బందుల గురి చేస్తున్నారు.

ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిని భయభ్రాంతులకు గురిచేస్తున్నా పోలీసులు

అక్రమ కేసులు పెట్టడానికి అమాయక దళితులే టార్గెట్ చేస్తున్నట్టు అనిపిస్తుంది.

ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసుల తీరు మారదా అంటూ పలు సంఘాల నాయకుల ఆవేదన.

సత్తార్ అనే కానిస్టేబుల్ ని సస్పెండ్ చేయాలి.

పిడిఎస్ యు రాష్ట్ర కమిటీ సభ్యులు కే. రాజేష్ డిమాండ్.

 

చేవెళ్ల మే 24 (ప్రజాక్షేత్రం): ప్రజాస్వామ్య వ్యవస్థలో పోలీసులు ప్రజలను రక్షించడానికి ఉండాలి. అన్యాయం చేస్తున్న వారి దగ్గరకి న్యాయంగా ఉండే వ్యక్తులు వెళ్లలేరు కాబట్టి పోలీసులను ఆశ్రయిస్తారు. అన్యాయం జరిగినప్పుడు మాత్రమే వారు పోలీస్ స్టేషన్ కి వస్తారు. పోలీసులు నిందితులకు అండగా ఉంటూ ఫిర్యాదు చేయడానికి వచ్చిన వారిపైనే కేసులు పెట్టడం సరైన విధానం కాదు వెంటనే కానిస్టేబుల్ సత్తార్ పైన చర్యలు తీసుకొని అతని సస్పెండ్ చేయాలని ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం (పిడిఎస్ యు) విద్యార్థి సంఘం రాష్ట్ర కమిటీ డిమాండ్ చేస్తుంది. అని అన్నారు. వికారాబాద్ జిల్లా, తాండూరు మండల కేంద్రంలో టీవీఎస్ ఫైనాన్స్ విషయంలో గురువారం రాత్రి 8:30 నిముషాల సమయంలో తాండూర్ పోలీస్ స్టేషన్ కి ఫిర్యాదు చేయడానికి వెళ్లిన పీడిఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పట్నం శ్రీనివాస్ పై కానిస్టేబుల్ సత్తార్ దాడిని ఖండిస్తున్నాం అని అన్నారు. ఫిర్యాదు చేయడానికి వచ్చిన శ్రీనివాస్ కంప్లైంట్ రాస్తుండగానే సత్తార్ అనే కానిస్టేబుల్ ఎస్ఐ సర్ పిలుస్తున్నాడు. లోపలికి రారా అంటూ ఒక విద్యార్థి సంఘం నాయకుడి కాలర్ పట్టుకుని బలవంతంగా ఈడ్చుకెళ్ళి బండ బూతులు తిడుతూ పిడుగుద్దులు గుద్ది, టీవీఎస్ ఫైనాన్స్ ఓనర్ ( రిటైర్డ్ ఏఎస్ఐ ) అతని ముందు సత్తార్ అనే కానిస్టేబుల్ ఓవరాక్షన్ తో రెచ్చిపోయారు. ‘ ‘ నేను కంప్లైంట్ రాస్తున్నాను సార్ రాసి వస్తాను అని చెప్పిన వినలేదు ‘ ఇదంతా జరుగుతున్న సమయంలో ఎస్సై కాశీనాథ్, సిఐ స్టేషన్లోపలే ఉన్న బయటికి రాలేదు. రెండు రోజుల్లో విద్యార్థి సంఘం నాయకుడు శ్రీనివాస్ పై దాడి చేసిన కానిస్టేబుల్ ని సస్పెండ్ చేయకపోతే పిడిఎస్ యు విద్యార్థి సంఘం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్త ఆందోళనలు ఉదృతం చేస్తామని హెచ్చరించారు.

Related posts