ఫైనల్కు దూసుకెళ్లిన SRH
హైదరాబాద్ మే 24 (ప్రజాక్షేత్రం): IPL టైటిల్ వేటలో SRH దుమ్మురేపింది. క్వాలిఫయర్-2లో RRపై ఘన విజయం సాధించి, ఫైనలు దూసుకెళ్లింది. 176 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన RRను హైదరాబాద్ బౌలర్లు మడతబెట్టేశారు. 139 పరుగులకే పరిమితం చేసి సూపర్ విక్టరీ సాధించింది. జురెల్ హాఫ్ సెంచరీతో ఒంటరి పోరాటం చేసినా ప్రయోజనం లేకుండా పోయింది. SRH స్పిన్నర్లు అభిషేక్, షాబాజ్ కీలక వికెట్లు తీసి మ్యాచును మలుపు తిప్పారు.