Praja Kshetram
పాలిటిక్స్

వాజ్‌‌పేయ్ లాగానే కిషన్‌రెడ్డిలో ఆ లక్షణం ఉంది : జగ్గారెడ్డి

వాజ్‌‌పేయ్ లాగానే కిషన్‌రెడ్డిలో ఆ లక్షణం ఉంది : జగ్గారెడ్డి

 

హైదరాబాద్ మే 24 (ప్రజాక్షేత్రం): కేంద్రమంత్రి కిషన్ రెడ్డి‌ పై కాంగ్రెస్ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి ప్రశంసల వర్షం కురిపించారు. కాంగ్రెస్ పార్టీ బ్రాండ్ అంబాసిడర్‌గా కిషన్‌రెడ్డి మారారని పొగడ్తలు కురింపించారు. కిషన్ రెడ్డి వ్యాఖ్యలను సంతోషంగా స్వాగతిస్తున్నానని తెలిపారు. ప్రభుత్వ పాలన బాగుందని కిషన్ రెడ్డి ఒప్పుకున్నందుకు సంతోషమని ప్రశంసించారు. గాంధీభవన్‌లో కిషన్‌రెడ్డి శుక్రవారం మీడియాతో మాట్లాడారు. కిషన్ రెడ్డికి వ్యవసాయ శాఖపై ఎలాంటి అవగాహన లేదని చెప్పారు. ధాన్యం మద్దతు ధర కేంద్రం నిర్ణయిస్తుందనే కనీస అవగాహన కిషన్ రెడ్డికి లేదన్నారు. 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలో చేరుతారని కిషన్ రెడ్డి అన్నారన్నారు. ప్రభుత్వ పాలన నచ్చే 25 మంది కాంగ్రెస్ పార్టీలో చేరుతున్నారని కిషన్ రెడ్డి ఒప్పుకున్నారని చెప్పారు. దివంగత ప్రధానమంత్రి అటల్ బీహారీ వాజ్‌‌పేయ్ వారసత్వాన్ని పుణికిపుచ్చుకున్న వ్యక్తి కిషన్ రెడ్డి అని కొనియాడారు.
అధికార పార్టీలు మంచి చేస్తే మెచ్చుకునే గుణం వాజ్‌పేయ్ లాగే కిషన్ రెడ్డికి వచ్చిందన్నారు. ఎన్ని కుట్రలు చేసినా కాంగ్రెస్ ప్రభుత్వాన్ని పడగొట్టలేరన్నారు. ఎన్ని ప్రయోగాలు చేసిన బీజేపీకి తెలంగాణలో స్థానం లేదన్నారు. మోదీ ఏ రాష్ట్రానికి వెళ్తే ఆ రాష్ట్రం బట్టలు, టోపీలు పెట్టుకుంటున్నారని ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ పార్టీ హత్యా రాజకీయాలను ప్రోత్సహించదని జగ్గారెడ్డి తెలిపారు.

Related posts