Praja Kshetram
తెలంగాణ

అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు వేగవంతం చేయండి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్

 

అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు వేగవంతం చేయండి: ఎంపీడీవో వెంకయ్య గౌడ్

 

శంకర్‌ పల్లి మే 25 (ప్రజాక్షేత్రం):అమ్మ ఆదర్శ పాఠశాలలో పనులు వేగవంతం చేయండని శంకర్‌పల్లి ఎంపీడీవో వెంకయ్య గౌడ్ అన్నారు. శనివారం ఎంపీడీవో కార్యాలయ సమావేశ మందిరంలో 18 గ్రామాల పాఠశాలల ఉపాధ్యాయులతో ఎంపీడీవో వెంకయ్య గౌడ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీడీవో వెంకయ్య గౌడ్ మాట్లాడుతూ పాఠశాలలో మూత్రశాలలు, త్రాగునీరు, విద్యుత్ కొరకు నిధులు మంజూరు అయ్యాయని పేర్కొన్నారు. పాఠశాలలో పెండింగ్ పనులను పూర్తి చేయాలని అధికారులకు ఆదేశించారు.
కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు.

Related posts