రైతులు కొనే విత్తనాలకి సంబంధించిన రశీదు తప్పకుండ తీసుకోవాలి.
గ్రామాలలో తక్కువ, ఎక్కువ ధరకు అమ్మే వారిపై చర్యలు తీసుకుంటాం.
మండల వ్యవసాయ అధికారి గణేష్.
కొండాపూర్ మే 27 (ప్రజాక్షేత్రం):
ఈ వానాకాలం విత్తనాలు కొనేముందు రైతులు తెలుసుకోవాల్సిన విషయాలు
మీరు కొనే విత్తనాలకి సంబంధించి బిల్ ( రశీదు ) తీసుకోవాలని కొండాపూర్ మండల వ్యవసాయ అధికారి గణేష్సోమవారం ఓ ప్రకటనలో తెలియజేశారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, గ్రామలలో కానీ, మీ మండలం లో కానీ, మీ జిల్లా లో కానీ అధీకృత ( లైసెన్స్) విత్తన డీలర్ దగ్గర మాత్రమే విత్తనాలు, ఏరువులు కొనుగోలు చేయాలన్నారు. పంట యొక్క దిగుబడి వచ్చేవరకు పంటకాలం అయిపోయేవరకు బిల్ ( రశీదు ) రైతు దగ్గర నే భద్రపరుచుకోవాలని తీసుకున్న రశీదు పైన విత్తన కంపెనీ పేరు, విత్తన రకం, బ్యాచ్ నెంబర్, లాట్ నెంబర్, రేటు ఉన్న విత్తనాలనే కొనుగోలు చేయాలన్నారు.విత్తన ప్యాకెట్ మీద తయారైన తేదీ, కాలం ముగిసిన తేదీ చూసుకోవాలని గ్రామాలలో తక్కువ ధరకు, ఎక్కువ ధరకు అమ్మే వారి వివరాలు మీ మండల వ్యవసాయ అధికారికి తెలియజేయాలన్నారు పక్క జిల్లా నుండి పక్క రాష్ట్రాల నుండి తీసుకొచ్చి ఎవరైనా నకిలీ విత్తనలు నకిలీ విత్తనాలు అమ్మినచో మాకు ఫోన్ లో సంప్రదించాలని రైతులకు తెలియజేశారు.రైతులు దయచేసి తొందరపడి అధీకృత (లైసెన్స్) డీలర్ దగ్గర కాకుండా ఇతరుల దగ్గర విత్తనాలు కొనుగోలు చేసి ఇబ్బందులకు గురి కావద్దని అన్నారు.