చందిప్ప మరకత శివాలయానికి ఉచిత ఆటో సౌకర్యం కల్పించిన దేవాలయం కమిటీ.
శంకర్ పల్లి మే 27 (ప్రజాక్షేత్రం):
మండలంలోని జంట గ్రామంలో వెలసిన మరకత శివలింగ దేవాలయానికి భక్తులు ఉచితంగా ప్రయాణించడానికి దేవాలయ కమిటీ వారు సోమవారం ఆటోను ప్రారంభించారు. ప్రతి సోమవారం వందల సంఖ్యలలో భక్తులు చందిప్ప శివాలయానికి వస్తూ ఉంటారు. అందుకోసం భక్తుల సౌకర్యార్థం ఈ ఆటో ప్రారంభించామని ఆలయ కమిటీ చైర్మన్ గౌడ్ తెలిపారు. దీంతో దేవాలయానికి వచ్చే భక్తులు శంకర్ పల్లి నుండి ఈ ఉచిత ఆటోలో రాకపోకలు కొనసాగించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఆల్ ఇండియా దేవాలయ ప్రచార కమిటీ చైర్మన్ దయాకర్ రాజు భక్తులు పాల్గొన్నారు.