Praja Kshetram
క్రైమ్ న్యూస్

బాలుడి ప్రాణం తీసిన ఈత సరదా..

బాలుడి ప్రాణం తీసిన ఈత సరదా..

 

రంగారెడ్డి జిల్లా మే 28 (ప్రజాక్షేత్రం): ఈత సరదా ఓ బాలుడి ప్రాణం తీసింది.. సరదాగా గడిపేందుకు ఓ కుటుంబం సోమవారం గండిపేట చెరువుకు వెళ్లింది. అక్కడ సరదాగా కొంతసేపు గడిపారు. అయితే గండిపేట చెరువులోని నీళ్లను చూసిన బాలుడు నోమిన్ (15) ఒక్కసారిగా సంతోషం పట్టలేక నీళ్లలోకి దిగాడు. బాలుడు ఎంతసేపటికీ బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందుతూ కేకలు వేశారు.సమాచారం అందుకున్న నార్సింగ్ పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని గజ ఈతగాళ్ల సాయంతో బాలుడి కోసం గాలించసాగారు. అయినా ఎలాంటి ఫలితం కనిపించలేదు. సరదా కోసం గండిపేటకు వచ్చిన బాలుడు ఆమెన్ నీళ్లలో గల్లంతు కావడంతో కుటుంబ సభ్యులు గుండెలు బాదుకుంటూ రోధిస్తున్న తీరు స్థానికులను కంటతడి పట్టించింది. ఘటనపై నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. పూర్తి సమాచారం తెలియాల్సి ఉంది.

Related posts