విద్యార్థులకు గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్
హైదరాబాద్ మే 28 (ప్రజాక్షేత్రం): విద్యార్థుల గుడ్ న్యూస్ చెప్పిన ఆర్టీసీ ఎండీ సజ్జనార్ విద్యార్థులకు టీజీఎస్ఆర్టీసీ ఎండీ సజ్జనార్ గుడ్ న్యూస్ చెప్పారు. వరంగల్ లోని టీజీఎస్ ఆర్టీసీ ఐటీఐ కళాశాలల్లో వివిధ ట్రేడ్లలో ప్రవేశాలకు దరఖాస్తులను ఆహ్వానించారు. అర్హత కలిగిన విద్యార్థులు జూన్ 10వ తేదీలోపు ఆన్ లైన్ (https://iti.telangana.gov.in) లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మోటార్ మెకానిక్ వెహికిల్, మెకానిక్ డిజిల్, వెల్డర్, పెయింటర్ ట్రెడ్‌లలో ప్రవేశాలు జరుగుతున్నాయని తెలిపారు.