Praja Kshetram
తెలంగాణ

వామ్మో.. ఈ యువతి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ముద్దు పెడుతుంటే నాగుపాము రియాక్షన్ చూడండి..!

వామ్మో.. ఈ యువతి ధైర్యానికి హ్యాట్సాఫ్ చెప్పాల్సిందే.. ముద్దు పెడుతుంటే నాగుపాము రియాక్షన్ చూడండి..!

 

ఈ ప్రపంచంలో చాలా మంది పాములంటే భయపడతారు. పాములు ఉన్నాయని తెలిస్తే అటు వైపు వెళ్లడానికి కూడా భయపడతారు. ఇక, భారీ విష సర్పాలను చూస్తే పై ప్రాణాలు పైనే పోతాయి. అలాంటిది ఓ అమ్మాయి ఎలాంటి భయమూ లేకుండా నాగుపామును ప్రేమపూర్వకంగా దగ్గరకు తీసుకుంది. దాని తలపై ముద్దు పెట్టింది. ఆ సమయంలో నాగుపాము రియాక్షన్ చూస్తే ఆశ్చర్యపోవాల్సిందే. ఆ వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.అనే ఇన్‌స్టాగ్రామ్ హ్యాండిల్‌లో ఈ వీడియో షేర్ అయింది. వైరల్ అవుతున్న ఆ వీడియోలో ఓ పొలంలో నాగుపాము ఉంది. అది తల పైకి ఎత్తి కూర్చుంది. దాని ఎదురుగా ఓ అమ్మాయి కూర్చుంది. ఆ పాముతో ఆ అమ్మాయి స్నేహపూర్వకంగా ఆడుకుంటోంది. పామును ప్రేమగా నిమిరింది. ఆ తర్వాత దాని తలపై ముద్దు పెట్టింది. అయినా ఆ నాగుపాము ఎటూ కదలకుండా ఆమె ముందు నిశబ్దంగా కూర్చుని ఉండిపోయింది. ఆ యువతి వైపు ఆ నాగుపాము కూడా స్నేహపూర్వకంగా చూస్తున్నట్టు ఉంది.
ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఈ వీడియోకు లక్షల్లో వ్యూస్ వచ్చాయి. దాదాపు 30 వేల మంది ఈ వీడియోను లైక్ చేశారు. ఈ వీడియోపై నెటిజన్లు తమ రియాక్షన్లన తెలియజేశారు. “ఆ పాము కోరలు పీకేసి ఉంటారు“, “విషం లేకపోయినా పాము ముందు అలా కూర్చుని ముద్ద పెట్టాలంటే చాలా ధైర్యం ఉండాలి“, “ఇది చాలా ప్రమాదకరం“, “ఆ పాము చాలా హింసకు గురై ఉంటుంది“ అంటూ నెటిజన్లు కామెంట్లు చేసి ఉంటారు.

Related posts