Praja Kshetram
తెలంగాణ

జూన్ 11 లోపు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెంచాలి:మంద కృష్ణ మాదిగ

జూన్ 11 లోపు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్లు రేవంత్ రెడ్డి ప్రభుత్వం పెంచాలి:మంద కృష్ణ మాదిగ

హన్మకొండ మే 29 (ప్రజాక్షేత్రం): బుధవారం హన్మకొండలో విలేకరుల సమావేశంలో ఎమ్మార్పీఎస్ అధినేత మంద కృష్ణ మాదిగ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో బిసి ఎస్సీ ఎస్టీల జనాభా 80% ఉన్నది.
ఎస్సీ ఎస్టీ బీసీలను మోసం చేస్తున్న రేవంత్ రెడ్డి సర్కార్ కు వ్యతిరేకంగా ఎస్సీ ఎస్టీ బీసీలను ఏకం చేస్తాం. బలమైన ఉద్యమాన్ని నిర్మిస్తాం.నమ్మించి ఏ విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ మోసం చేస్తుందో రిజర్వేషన్ల పెంపుదలలో నిర్లక్షమే సాక్ష్యం.ఎస్సీ ఎస్టీలను నమ్మించడానికి ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేసింది. దానిని నమ్మించే ప్రయత్నం చేయడానికి సాక్షాత్తు కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడే దళిత వర్గం గనుక మల్లికార్జున్ గారిని చేవెళ్లకి తీసుకొచ్చి ఎస్సీ ఎస్టీల రిజర్వేషన్లు పెంచుదాం అని చెప్పి డిక్లరేషన్ తన చేతుల మీద చేయించాడు రేవంత్ రెడ్డి .ఈ వర్గాలు నమ్మాలంటే ఆ వర్గాల ప్రతినిధినే తీసుకురావాలని చెప్పి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు దళిత నేత మల్లికార్జున్ ఖర్గే గారి చేతుల మీద చేవెళ్లలో ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ చేశారు. అందులో ప్రధానంగా ఉన్నది ఎస్సీల రిజర్వేషన్లను 15 నుంచి 18 శాతం పెంచుతామని, ఎస్టీ రిజర్వేషన్లను ఇప్పుడు అమలు జరుగుతున్న 10 నుంచి 12% పెంచుతామని అందులో పేర్కొనడం జరిగింది. కులగనన చేసి ఆరు నెలలోపే బిసి రిజర్వేషన్లు పెంచుతామని, బీసీ డిక్లరేషన్ కూడా చేసింది.
రేవంత్ రెడ్డి కర్ణాటక ప్రస్తుత ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు కూడా బీసీ కాబట్టి బీసీ డిక్లరేషన్ను కామరెడ్డి లో ఆయన చేతనే చేయించారు.ఇప్పుడు ఆయన ప్రభుత్వం ఏర్పడి ఇంకొక పది రోజుల్లో ఆరు నెలలు దాటపోతుంది.ప్రధానంగా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్లు పెంచడానికి ఎందుకు ప్రయత్నం చేయాలేదు.ఏ రాష్ట్రంలో ఎంత జనాభా ఉంటే అంత పెంచుకోవచ్చు అని చెప్పి రాజ్యాంగం చెప్తున్నది దానికోసం అసెంబ్లీ సమావేశాలు నిర్వహించాల్సిన అవసరం లేదు దానికోసం కొత్త చట్టాలు తీసుకురావాల్సిన అవసరం కూడా లేదు. ఎన్టీ రామారావు గారి ముఖ్యమంత్రి ఉన్న కాలంలో ఎస్సీలకు ఉండబడే 14 శాతం రిజర్వేషన్లు 15%, ఎస్టీ 4 ఉన్న కాలంలో 6% పెంచారు. ఈ దేశంలో జనాభాపరంగా పెంచుకోవడానికి రాజ్యాంగం ఆమోదిస్తున్నది.
రేవంత్ రెడ్డి ఎందుకు పెంచలేదు.ఓట్ల కోసం నమ్మించడానికి చేసినంత ప్రయత్నం ఇచ్చిన మాట నిలబెట్టుకోవడానికి రేవంత్ రెడ్డి ప్రయత్నం చేయలేదు అనడానికి ఒక గంట సమయం అధికారులతో కూసుంటే ఆర్డర్ పాస్ కావడానికి అవకాశం ఉన్నది.
ఒక గంట సమయం కూర్చుంటే ఆర్డర్ పాస్ కావడం కోసం ఈ సమస్యను ఆరు నెలలు దగ్గరకు వచ్చినా కూడా ఎస్సీ ఎస్టీ రిజర్వేషన్ పెంచలేదంటే ఓట్ల కోసం తాపత్రయంతో మా వర్గాలను నమ్మించి ప్రయత్నం చేశాడు.కానీ అధికారం తీసుకున్నాంక మాత్రం మా ఎస్సీ ఎస్టీ వర్గాలని మోసం చేసిండు అనడానికి ఇది ఒక సాక్ష్యం.అదే సమయంలో కామారెడ్డిలో చేసిన డిక్లరేషన్ ప్రకారంగా కులగణన నిర్వహించి ఆరు నెలల్లోపు రిజర్వేషన్లు ఇస్తామని చెప్పారు. ఇప్పుడు ఆరు నెలలు దగ్గరకు వస్తుంది కూడా.లేబీసీలది జనాభా లెక్కలు కట్టడానికి నెలలు తరబడి ఎందుకు తీసుకోవాలి.అన్ని సామాజిక వర్గాల జనాభా లెక్క కట్టడానికి సమగ్ర సర్వే చేశారు. ఆ సమగ్ర సర్వే ఒక్కరోజులో పూర్తి చేసినప్పుడు ఒక బీసీల జనాభా లెక్క కట్టడానికి ఎందుకు నెలలు టైం తీసుకోవాలా ?అంటే ఇక్కడ బీసీల రిజర్వేషన్లు పెంచడం అనేది ఆయనకు వెంటనే ఇష్టం లేదని అర్థం అవుతుంది.
అందువల్ల ఎస్సీ ఎస్టీ బీసీ సంఘాల నాయకత్వాన్ని బీసీల అన్ని పార్టీల నాయకులందరినీ ఏకం చేస్తాం.
జూన్ 11 లోపు ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ పెంపు విషయంలో ఒక నిర్దిష్టమైన నిర్ణయం తీసుకోకపోతే జూన్ 11 తర్వాత ఎస్సీ ఎస్టీ బీసీల సంఘటితశక్తి చూపుతం.
రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి ముచ్చెమటలు ఎలా పట్టించాలో సిద్ధంగా ఉండాలని ఎస్సీ ఎస్టీ బీసీ ప్రజలందరినీ కోరుతున్నాం.
ఇప్పుడు సాధించుకోకపోతే, ఎస్సీ ఎస్టీ బీసీల రిజర్వేషన్ల పెంపును అమలు జేయించుకోకపోతే నష్టపోయేది మన వర్గాలే.
రేవంత్ రెడ్డి ఎస్సీ ఎస్టీ బీసీల ప్రయోజనాలను దెబ్బతీసి ఉన్నత వర్గాలకు దోచిపెట్టడం కోసమే అన్ని రంగాల్లో అవకాశాలు దోశ పెట్టడం కోసమే ఎస్సీ ఎస్టీ బీసీ రిజర్వేషన్ పెంపుదల విషయంలో ఒక నిర్ణయానికి రాలేదు.ముస్లిం ప్రజలను నమ్మించడానికి ఖుషీద్ అహ్మద్ అనే నాయకులు తీసుకొచ్చి ముస్లిం డిక్లరేషన్ ప్రకటింపజేశారు.ముస్లిం డిక్లరేషన్ ను ఎందుకు అమలు చేయలేదు.ముస్లింలకు మంత్రివర్గంలో స్థానం ఎందుకు ఇవ్వలేదు.కేవలం ఓట్ల కోసం నమ్మించడానికి డిక్లరేషన్ పెట్టారే తప్ప ఆ ప్రజల మీద ఏమాత్రం చిత్తశుద్ది లేదని అర్థమవుతుంది.రేపు జూన్ లో పూర్తిస్థాయి బడ్జెట్ లో ప్రత్యేక బడ్జెట్ సమావేశాలు మొదలవుతాయి.రిజర్వేషన్లు ఎంత పెరిగితే బడ్జెట్ అంతా పెరుగుతాయి.ఉదాహరణకు ఎస్సీలకు రిజర్వేషన్ల ప్రకారం 15 వేల కోట్లు కేటాయించబడితే అదే రిజర్వేషన్లు పెరిగితే 18 వేల కోట్లు అదనంగా కేటాయించబడతాయి. ఎస్టిలకు పదివేల కోట్లు నుండి 12,000 కోట్లు కేటాయించబడతాయి బీసీలకు 23 నుండి 52 కోట్లు కేటాయించబడతాయి.
రిజర్వేషన్లు పెరిగితే ఎస్సీ ఎస్టీ బీసీల సంక్షేమం కోసం బడ్జెట్ పెరుగుతుంది, విద్యారంగంలో అవకాశాలు పెరుగుతాయి, సంక్షేమ హాస్టల సంఖ్య పెరుగుతుంది, ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, అన్ని రంగాల్లో సమగ్రంగా అభివృద్ధి చేయడానికి దారి తీస్తుంది. తెలంగాణలో అగ్రకులాల జనాభా 7% ఉంటే ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ల కింద 10% రిజర్వేషన్లను రేవంత్ రెడ్డి సర్కార్ అమలు చేస్తుంది.
ఇ డబ్ల్యూ ఎస్ రిజర్వేషన్లు కేవలం అగ్రకులాల్లోని పేదలకు మాత్రమేఇవ్వాలి.దాని ప్రకారం కేవలం రెండు నుండి మూడు శాతం రిజర్వేషన్ మాత్రమే అమలు చేయాలి కానీ అన్ని అవకాశాలు వారికి దోచిపెట్టడానికి రేవంత్ రెడ్డి ప్రభుత్వం వారికి 10% రిజర్వేషన్లు ఇస్తూ జనాభాకు మించి అమలు చేస్తున్నారు.కానీ ఎస్సీ ఎస్టీ బీసీలకు మాత్రమే జనాభా ప్రకారం రిజర్వేషన్లు ఇవ్వడం లేదు.ఇక జూన్ 11 లోపు నిర్ణయం రాకపోతే ఎస్సీ ఎస్టీ బీసీ లు భవిష్యత్తు యుద్ధానికి సిద్ధమవుతారని హెచ్చరిస్తున్నాం. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షులు గోవిందు నారేష్ మాదిగ,మంద కుమార్ మాదిగ, మున్నూరు కాపు సురేష్, సుకుమార్ తదితరులు పాల్గొన్నారు.

Related posts