Praja Kshetram
తెలంగాణ

ఆ అర్హత బీజేపీకి లేదు: విజయశాంతి

ఆ అర్హత బీజేపీకి లేదు: విజయశాంతి

 

హైదరాబాద్ మే 29 (ప్రజాక్షేత్రం): తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవానికి సోనియా గాంధీని ఆహ్వానించడాన్ని ప్రశ్నించే అర్హత బీజేపీకి లేదని కాంగ్రెస్ నేత విజయశాంతి అన్నారు. ఈ కార్యక్రమానికి వచ్చే అర్హత సోనియాకు ఉందని ఎంపీ కిషన్ రెడ్డిని ఉద్దేశించి ఎక్స్ లో ట్వీట్ చేశారు. తెలంగాణ ఏర్పాటుకు కారణమైన సోనియాగాంధీని ఉద్యమకారులు ఎప్పటికైనా గౌరవిస్తారని అన్నారు. రాష్ట్ర ఏర్పాటులో అసలు బీజేపీ ప్రమేయం ఎక్కడ ఉందని ఆమె ప్రశ్నించారు.

Related posts