దాడి చేసిన కానిస్టేబుల్ మరియు ఎస్సై పైన చర్యలు తీసుకోవాలి
తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించిన పి డి ఎస్ యు ఉమ్మ రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్
తాండూర్ మే 29 (ప్రజాక్షేత్రం): ఫిర్యాదు చేయడానికి తాండూర్ స్థానిక పోలీస్ స్టేషన్కు వచ్చిన పి డి ఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు పి శ్రీనివాస్ పై తేదీ: 23/05/2024 నాడు కానిస్టేబుల్ సత్తార్ దాడి చేసిన సంఘటనపై దానికి వత్తాసు పలికిన ఎస్సై కాశీనాథ్ పై ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని, సంఘటన జరిగి వారం రోజులు గడుస్తున్నా ఎలాంటి చర్యలు తీసుకోకపోగా దాటివేసి ప్రయత్నాలు చేస్తున్నరు తెలియజేయడం జరిగింది. ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదు ప్రజలకు తెలియజేయవలసిన అవసరం ఉందని పేర్కొనడం జరిగింది. భారత రాజ్యాంగంలో ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానమే కదా మరి ఇప్పటివరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని తెలియజేయడం జరిగింది. అందుకే తెలంగాణ రాష్ట్ర మానవ హక్కుల కమిషన్ ఆశ్రయించడం జరిగిందని తెలియజేయడం జరిగింది. ఇప్పటికైనా ఉన్నత అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో పి ఓ డబ్ల్యూ జిల్లా కార్యదర్శి గీతా మహేందర్, పి డి ఎస్ యు ఉమ్మడి రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు శ్రీకాంత్ మరియు జిల్లా సభ్యులు జైపాల్, సురేష్, అశోక్ తదితరులు పాల్గొన్నారు.