Praja Kshetram
తెలంగాణ

గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ అభ్యర్థులకు బిగ్‌ అప్‌డేట్‌..!

హైదరాబాద్ మే 29 (ప్రజాక్షేత్రం): గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ అభ్యర్థులకు తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ కీలక అప్‌డేట్‌ ఇచ్చింది. జూన్‌ ఒకటో తేదీ మధ్యాహ్నం నుంచి హాల్‌ టికెట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని, అభ్యర్థులు డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చని టీజీపీఎస్సీ పేర్కొంది. జూన్‌ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటిగంట వరకు గ్రూప్‌-1 ప్రిలిమ్స్‌ పరీక్ష జరుగనున్న విషయం తెలిసిందే. పరీక్ష కోసం టీజీపీఎస్సీ అన్ని ఏర్పాట్లు చేస్తున్నది. రాష్ట్రంలోని 563 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసిన విషయం తెలిసిందే. ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు దరఖాస్తులు స్వీకరించారు. జూన్‌ 9న ప్రిలిమ్స్ పరీక్షను నిర్వహిస్తున్నది. జూన్ ఒకటి నుంచి టీజీసీఎస్సీ అధికారిక వెబ్‌సైట్‌ tspsc.gov.in లో హాల్ టికెట్లు అందుబాటులో ఉంటాయని పేర్కొంది. అక్టోబర్‌ 21 నుంచి మెయిన్స్ పరీక్షలను నిర్వహించనున్నది.

Related posts