*ఇబ్రహీంపల్లి లో సమస్యలు పట్టించుకోని అధికారులు*
*-మిషన్ భగీరథ నీళ్ల,అండర్ డ్రైనేజీల సమస్య అని చెప్పిన సరే చూద్దాం అనే సమాధానం*
*-ఇంటి టాక్స్ లు ప్రతి సంవత్సరం నాలుగు లక్షల రూపాయలకు పైగా వసూళ్లు*
*-ఈ గ్రామానికి నా సొంత డబ్బులు 70 వేల రూపాయలు పెట్టాను నేనేం చేయాలి అంటున్న సెక్రెటరీ*
*-మరి మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలి ఎవరితో తీరుతాయి*
*-వెంటనే పై అధికారులు స్పందించి ఉన్న సమస్యలు పరిష్కరించాలంటున్న కాలనీవాసులు*
చేవెళ్ల మే 29 (ప్రజాక్షేత్రం) రంగారెడ్డి జిల్లా చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి గ్రామానికి అనుబంధమైన జాజుగుట్ట కాలనీలో అనేక సమస్యలు అనే విషయాన్ని కాలానివాసులు ప్రజాక్షేత్రం పత్రిక ప్రతినిధి చేవెళ్ల తో మాట్లాడుతూ…..మిషన్ భగీరథ ఇంటింటికి నల్ల కనెక్షన్లు ఇచ్చినప్పటి నుండి ఎన్నడు కూడా సరిగా నీళ్లు రావడం లేదని,ఎని సార్లు వాటర్ మెన్ ను అడిగిన ఆ డిపార్ట్ మెంట్ లో పని చేసే అధికారులను అడిగిన ఇక్కడ ప్రాబ్లం ఉంది అక్కడ ప్రాబ్లం ఉంది ఈ కాలనీ గడ్డ పైన ఉంది కాబట్టి నీళ్ళు సరిగ్గా ఎక్కడం లేదని ఏదో ఒక సమాధానం చెప్పి తప్పించుకుంటున్నారే తప్ప నీళ్ల సమస్యను పరిష్కరించడం లేదని,ఏమి చేయలేని పరిస్థితిలో ఇండ్లలో బోర్లు ఉన్న వారిని బ్రతిమలాడుకోని కాలం వెళ్ళదీస్తున్నామని,అండర్ డ్రైనేజీలు నిండి అక్కడక్కడ లీకై కంపు కొడుతుంటే ముక్కు మూసుకొని నడవవలసిన పరిస్థితి ఉందని,స్తంభాలకు ఉన్న లైట్లు ( వీధి ద్వీపాలు ) గత 15 రోజుల కిందట భారీ ఈదురుగాలులతో వీయడంతో కొన్ని స్తంభాల లైట్లు తెగిపడి స్టార్ కనెక్షన్ వైర్ల మీద వేలాడుతున్నాయని,అవి ఎప్పుడు కింద పడతాయో ఎవరి మీద పడతాయో అనే భయంతో దూరం నుంచి నడుస్తున్నామని,గ్రామ కార్యదర్శి ని అక్కడికి పిలిపించి చూపించామని,ట్రాన్స్ఫార్మర్ చుట్టూ ఎలాంటి కంచే ఏర్పాటు చేయకుండా అలాగే గాలికి వదిలేశారని,ప్రతి సంవత్సరం ఇంటి టాక్స్ లు గా వసులు చేసిన డబ్బులు ఏం చేస్తున్నారని,రాజకీయ నాయకులు మా కాలానీ కి ఎన్నికల సమయంలో వచ్చినప్పుడు సమస్యల కోసం చెప్తే ఏవేవో పేకుడు మాటలు చెప్పి ఓట్లు వేయించుకుంటారు తప్ప సమస్యలు పరిష్కరించడం లేదని మండిపడుతున్నారు.వెంటనే మా సమస్యల ను పై అధికారులు రాజకీయ నాయకులు పరిష్కరించాలని కోరారు.ఈ విషయంపై గ్రామ సెక్రెటరీ వివరణ కోరగా…. గ్రామానికి ఇన్చార్జిగా ఉన్న ఎమ్మార్వో దృష్టికి ఈ సమస్యలను తీసుకెళ్లారా అని అడగగా లేదు అనే సమాధానం ఇచ్చాడు.ఈ గ్రామంలో ఇప్పటికే నేను నా సొంత డబ్బులు డెభై వేల రూపాయలు ఖర్చు పెట్టాను ఇంకా నా డబ్బులు నాకే రాలేవు స్తంభంపై వేలాడుతున్న లైట్లను తీయాలంటే పెద్ద నిచ్చెన కావాలి ఆ నిచ్చెనకు పదిహేను వందల రూపాయలు నా దగ్గర లేవు,అండర్ డ్రైనేజీ వాటర్ ఎక్కడ లీక్ అవుతుందో ఫోటో పెట్టమనండి చూస్తా,ట్రాన్స్ఫార్మర్ దగ్గర ఒక బుడ్డి కాలిపోయింది దానికి పదివేల రూపాయలు ఖర్చు అవుతుందని విద్యుత్ డిపార్ట్మెంట్ వారు అంటున్నారు అంటూ వారి వివరణగా తెలిపారు.