Praja Kshetram
తెలంగాణ

గుంతను పూడ్చండి మహాప్రభో..

గుంతను పూడ్చండి మహాప్రభో..

*కాలనీవాసుల విజ్ఞప్తి*

*అంబేద్కర్ చౌక్ నుంచి బిరెల్లి చౌరస్తా వరకు గుంతల మయంగా మారిన రోడ్డు*

జోగులాంబ గద్వాల జిల్లా మే 29 (ప్రజాక్షేత్రం):గద్వాల పట్టణంలోని రెండవ రైల్వే గేట్ దాటిన కొద్ది దూరంలో ప్రధాన రోడ్డుపై ఒక సంవత్సరం కాలం నుంచి పెద్దగా ఉన్న గుంతను పూడ్చి పుణ్యం కట్టుకోండి మహాప్రభో అంటూ కాలనీవాసులు, ప్రయాణికులు సోషల్ మీడియా ద్వారా కోరుతున్నారు. దాదాపు ఒక సంవత్సరం కాలం నుంచి ఈ గుంత అదే విధంగా ఉండడంతో వర్షాకాలం తో పాటు మిగతా రోజులలో నీళ్లు నిలువ చేరడంతో వాహనదారులకు, పాదాచారులకు, కాలనీవాసులకు తీవ్ర ఇబ్బందులకు గురి అవుతుంది. వర్షాకాలం వచ్చిందంటే ఆ పెద్ద గుంతలో నీళ్లు ఎక్కువగా ఉండడంతో ఎక్కడ ఎంత పెద్ద గుంత ఉందో తెలియక వాహనదారులు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. సంబంధిత అధికారులు ఇట్టి విషయంపై చర్యలు చేపట్టి అట్టి గుంతను పూడ్చి న్యాయం చేయాలని కోరుతున్నారు కాలనీవాసులు.
మున్సిపల్ చైర్మన్ బి ఎస్ కేశవ్, మున్సిపల్ కమిషనర్ స్పందించాలని పట్టణ ప్రజలు మరియు కాలనీవాసులు కోరారు.

Related posts