సిఐటియు 54వ ఆవిర్భవ దినోత్సవ సందర్భంగా సిఐటియు జెండాలు ఆవిష్కరణ : సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్
షాబాద్ మే 30 (ప్రజాక్షేత్రం): షాబాద్ మండల పరిధిలోని వివిధ గ్రామాలలో సిఐటియు జెండాలను ఎగురవేయడం జరిగింది. నాగర్ కుంట గ్రామంలో గ్రామపంచాయతీ యూనియన్ షాబాద్ మండల అధ్యక్షుడు సత్తయ్య ఆధ్వర్యంలో సిఐటియు జెండాను ఆవిష్కరించడానికి ముఖ్యఅతిథిగా సిఐటియు జిల్లా సహాయ కార్యదర్శి అల్లి దేవేందర్ హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సిఐటియు ఏర్పడి నేటికీ 54 సంవత్సరాలు పూర్తి చేసుకుందని గత 54 సంవత్సరాలుగా కార్మికుల కోసం అనేక పోరాటాలు నిర్వహించి కార్మికుల సంక్షేమం కోసం కట్టుబడి అనేక పోరాటాలు చేసిందన్నారు. ముఖ్యంగా కార్మికులకు ఎనిమిది గంటల పని విధానం ఈఎస్ఐ,పిఎఫ్ సౌకర్యం శ్రమకు తగ్గిన వేతనం తదితర డిమాండ్ల కోసం ప్రభుత్వాలతో వీరోచితంగా పోరాడి కార్మికుల హక్కులు సాధించిందన్నారు అలాగే కక్కులూరు కేసారం గ్రామంలో నూతన సిఐటియు జెండాలను ఆవిష్కరించారు సిఐటియు కార్మికుల సంక్షేమం కోసం పాలకవర్గాలతో కేంద్ర రాష్ట్ర ప్రభుత్వ కార్మిక వ్యతిరేక విధానాలపై అనేక పోరాటాలు చేసిందన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు మండల నాయకులు సత్తయ్య నరసింహ సిహెచ్ నరసింహ మల్లయ్య కవిత సుజాత నరసింహ రమేష్ రామచంద్రయ్య అంజయ్య తదితరులు పాల్గొన్నారు.