రిటర్నింగ్ అధికారి పై వేటు
ప్రకాశం జిల్లా మే 30 (ప్రజాక్షేత్రం): యర్రగొండపాలెం నియోజకవర్గ రిటర్నింగ్ అధికారి డాక్టర్ శ్రీ లేఖను తొలగిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రధాన కార్యదర్శి మీనా కుమార్ బుధవారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు.ఈనెల 13న జరిగిన పోలింగ్లో యర్రగొండపాలెం నియోజక వర్గంలో ఘర్షణలు జరిగిన సమయంలో సకాలంలో స్పందించకపోవడంతో ఎన్నికల కమిషన్ వేటు వేసినట్లు తెలిపారు. గురువారం నియోజకవర్గంకు కొత్త ఆర్ఓ ను కలెక్టర్ నియమించనున్నట్లు చెప్పారు.