Praja Kshetram
తెలంగాణ

పత్తి విత్తనాల కోసం ధర్నాకు దిగిన రైతులు

పత్తి విత్తనాల కోసం ధర్నాకు దిగిన రైతులు

ఆదిలాబాద్‌ మే 30 (ప్రజాక్షేత్రం): కాంగ్రెస్‌ ప్రభుత్వంలో విత్తన సంక్షోభం నెలకొన్నది. విత్తనాల కోసం రైతుల వెతలు అన్నీ ఇన్నీ కావు. నిన్న మొన్నటి వరకు పచ్చిరొట్ట విత్తనాలనే పంపిణీ చేయలేక రాష్ట్ర ప్రభుత్వం చేతులెత్తేసింది. జనుము, జీలుగ, పచ్చి రొట్ట విత్తనాలు ఇవ్వలేని ప్రభుత్వం ఎరువులు, విత్తనాలు సరిపడా ఇస్తుందా ? అని రైతులు ప్రశ్నిస్తున్నారు. తాజాగా పత్తి విత్తనాల కొరతపై రైతుల ఆగ్రహం వ్యక్తంగా చేస్తున్నారు. ఆదిలాబాద్‌ జిల్లాలో వరుసగా మూడో రోజు విత్తనాల కొరతతో అన్నదాతలు ఇబ్బందులు పడుతున్నారు.
వ్యాపారులు ఒక్కో రైతుకు రెండు ప్యాకెట్లు మాత్రమే సరఫరా చేస్తున్నారు. విత్తనాల పంపిణీ, ప్రభుత్వ నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ ఆదిలాబాద్‌ పట్టణంలోని పంజాబ్ చౌక్‌లో రైతులు ధర్నా చేపట్టారు. దీంతో ఎక్కడికక్కడ వాహనాలు నిలిచిపోయాయి. సమస్యను పరిష్కరించే వరకు ఆందోళన విరమించే ప్రసక్తే లేదని రైతులు తేల్చి చెబుతున్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి విత్తనాల కొరత తీర్చాలని డిమాండ్‌ చేస్తున్నారు.

Related posts