ఇబ్రహీంపల్లిలో సమస్యలు పరిష్కరించాలి. ప్రజాక్షేత్రం పత్రిక కథనానికి స్పందించిన అధికారులు
-ఇవాల్టి నుంచి ఈ కాలనీ కి ఒక ట్యాంక్ నీళ్లు ఎక్స్ ట్రా ఇస్తాం,నీటి సమస్య లేకుండా చూసుకుంటాం
-మిషన్ భగీరథ నల్ల నుండి చెర్ర తీసిన వారిపై చర్య తీసుకుంటాం
-గీత ఏఈఈ ఇంట్రా చేవెళ్ల
-విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ బుడ్డి కోసం డబ్బులు అడుగుతే మా దృష్టికి తేవాలి
-విద్యుత్ శాఖ ఏఈ మహమ్మద్ జాని మొహినోద్దీన్ చేవెళ్ల
చేవెళ్ల మే 30 (ప్రజాక్షేత్రం):చేవెళ్ల మండలం ఇబ్రహీంపల్లి గ్రామంలోని జాజుగుట్ట కాలనీ గురువారం ప్రజాక్షేత్రం పత్రికలో ఇబ్రహీంపల్లిలో సమస్యలు పరిష్కరించాలి అని ప్రచురితమైన వార్తకు వెంటనే మిషన్ భగీరథ నీళ్ల అధికారులు గీత ఏఈఈ ఇంట్రా,ఇర్ఫాన్ డిఈఈ గ్రిడ్,కుమార్ ఏఈఈ గ్రిడ్ చేవెళ్ల స్పందించి జాజుగుట్ట కాలనీ లో ఉన్న వాటర్ ట్యాంకును పరిశీలించి ఇంటింటి నల్ల వాల్ ను ఓపెన్ చేశారు.ప్రతి ఇంటికి వెళ్లి నీళ్లు ఎలా వస్తున్నాయో చూశారు.ఈ సందర్భంగా గీత ఏఈఈ ఇంట్రా మాట్లాడుతూ….. ఈ కాలనీ లో నీళ్లు రావడంలేదనే వార్త చూసి మా డిపార్ట్మెంట్ అందరం కలిసి రావడం జరిగిందని,ప్రతిరోజు మిషన్ భగీరథ నీళ్లు వస్తున్నాయి కానీ కాలనీ కి సరిపడినంత రావడం లేదని,కొన్ని ఇండ్లవారు గ్రామ ప్రజల,అధికారుల కండ్లు గట్టి నల్ల కనెక్షన్ లో ఉన్నటువంటి చెర్రను తొలగించి నీళ్లను సంపులలో నింపుకుంటున్నారని,ఇండ్లలో బోర్లు ఉన్నవాళ్లు ఈ నీళ్లను వేస్ట్ గా వదిలేస్తున్నారని,వెంటనే వారిపై తగిన చర్య తీసుకుంటామని,నల్ల నీళ్లు అవసరం లేని వారు నల్ల వాల్ ను ఆఫ్ చేస్తే ఇంకొక ఇంటికి సరిపడే నీరు అందుతుందని,ఇవాల్టి నుంచి ఈ కాలనీకి ఒక ట్యాంక్ నీళ్లు ఎక్స్ ట్రగా ఇస్తామని,నీటి సమస్య లేకుండా చూసుకుంటామని అన్నారు. అనంతరం ప్రజాక్షేత్రం శీర్షికలో వచ్చిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ బుడ్డి కాలిపోయింది పది వేల రూపాయలు ఖర్చు అవుతుందని అని ప్రచురితమైన వార్తకు విద్యుత్ ఏఈ మహమ్మద్ జానీ మొహినోద్దీన్ చేవెళ్ల స్పందించి మాట్లాడుతూ…. మేము ఎవరి దగ్గర డబ్బులు అడగలేమని మరి ఈ గ్రామ కార్యదర్శిని ఎవరు అడిగారో మా దృష్టికి తేవాలిగా ఇలా చెప్పడం సరికాదని,మాకు బుధవారం సాయంత్రం ఇబ్రహీంపల్లి ఇన్చార్జిగా కొనసాగుతున్న స్థానిక ఎమ్మార్వో గారు మాట్లాడి వెంటనే ఆ కాలనీ లోని కాలిపోయిన ట్రాన్స్ఫార్మర్ బుడ్డిని తొలగించి కొత్తది పెట్టాలని సూచించారు.కాబట్టి మేం కొత్త బుడ్డిని పెట్టామని అన్నారు.