కొండ విశ్వేశ్వర్ రెడ్డి విజయం కోసం ప్రత్యేక పూజలు
– *బిజెపి మండల ఉపాధ్యక్షులు గౌండ్ల కృష్ణ గౌడ్*
చేవెళ్ల మే 30 (ప్రజాక్షేత్రం):చేవెళ్ల బిజెపి పార్లమెంటరీ అభ్యర్థి కొండ విశ్వేశ్వర్ రెడ్డి గారు అత్యధిక మెజార్టీతో గేలవబోతున్న సందర్భంగా గురువారం తమిళనాడులోని రామేశ్వరం జ్యోతిర్లింగంలో ప్రత్యేక పూజలు నిర్వహించిన చేవెళ్ల మండల బిజెపి ఉపాధ్యక్షులు న్యాయవాది గౌండ్ల కృష్ణ గౌడ్ మరియు బిజెపి లీగల్ టీం ప్రత్యేకంగా పూజలు నిర్వహించి నరేంద్ర మోడీ మూడవసారి ప్రధానమంత్రిగా అయ్యి దేశాన్ని మరింత అభివృద్ధి పథంలో తీసుకెళ్లగలరని విశ్వాసం వ్యక్తం చేశారు. వారు మాట్లాడుతూ చేవెళ్ళ పార్లమెంట్ పరిధిలో అనేక సమస్యలు ఉన్నాయి,వాటిని త్వరగా పరిష్కరించి చేవెళ్ళ పార్లమెంటును అభివృద్ధి పథంలో కొండ విశ్వేశ్వర్ రెడ్డి తీసుకెళ్తారని వారు విశ్వాసం వ్యక్తం చేశారు.