ఆగ్రోస్ రైతు సేవ కేంద్రాన్ని సందర్శించిన : జిల్లా వ్యవసాయ అధికారి ఎస్ గీత
శంకర్ పల్లి మే 30 (ప్రజాక్షేత్రం): శంకర్ పల్లిలో పచ్చిరొట్ట ఎరువుల సరఫరా చేసే ఆగ్రోస్ రైతు సేవా కేంద్రాన్ని రంగారెడ్డి జిల్లా వ్యవసాయ అధికారి గీత సందర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత సంవత్సరం శంకర్ పల్లి మండలంకు సంబంధించిన 140 క్వింటాళ్ల పచ్చిరొట్ట ఎరువు సరఫరా చేయగా ఈ సంవత్సరం ఇప్పటి వరకు 262 క్వింటాళ్ల జనము, జీలుగలు రైతులకు పంపిణీ చేయడం జరిగింది. అదేవిధంగా మండలంలోని రైతులందరూ ప్రభుత్వం పర్మిషన్ ఉన్న డీలర్ షాపులో మాత్రం విత్తనాలు కొనుగోలు చేయాలని సూచించారు. ఈ మండలం ప్రతి విత్తనాలు సరిపడా ఉన్నాయని అన్నారు. ఈ కార్యక్రమంలో సహాయ వ్యవసాయ సంచాలకులు రమదేవి, మండల వ్యవసాయ అధికారి పి.సురేష్ బాబు, ఏఈఓలు రామక్రిష్ణా రెడ్డి, రమ్యా, మౌనిక,పీల రైతులు తదితరులు పాల్గొన్నారు.