Praja Kshetram
ఆంధ్రప్రదేశ్

సజ్జల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సీఈఓ ఎంకే మీనా

సజ్జల వ్యాఖ్యలపై ఘాటుగా స్పందించిన సీఈఓ ఎంకే మీనా

 

అమరావతి మే 30 (ప్రజాక్షేత్రం): వైసీసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణారెడ్డి ఎన్నికల సంఘంపై వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన విషయం తెలిసిందే. అయితే ఈ వ్యాఖ్యలపై సీఈఓ ముఖేష్ కుమార్ మీనా ఘాటుగా స్పందించారు. గురువారం మచిలిపట్నంలోని ఓ కౌంటింగ్ సెంటర్‌లో ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మీడియాతో సీఈఓ ఎంకే మీనా మాట్లాడారు. ఎన్నికల కౌంటింగ్ రోజు లోపల హాల్లో ఎవరైనా అల్లర్లు చేయాలని చూస్తే వారిని వెంటనే అరెస్టు చేసి జైలుకు పంపుతామని హెచ్చరికలు జారీ చేశారు. అభ్యర్థి, ఏజెంట్‌లలో ఎవరైనా కౌంటింగ్ సెంటర్లో గొడవ చేయాలని, అడ్డుకోవాలని చూస్తే వారిని వెంటనే అక్కడి నుంచి బయటకు పంపిస్తామనివార్నింగ్ ఇచ్చారు. కౌంటింగ్ ఏరియా చుట్టూ ఎలాంటి ఊరేగింపులు చేయడానికి వీలులేదని తేల్చిచెప్పారు. ఆరోజు మధ్యం షాపులు కూడా పూర్తిగా మూసివేయాలని ఆదేశాలు జారీ చేశారు. కౌంటింగ్ సెంటర్ల భద్రత కోసం మూడంచెల వ్యవస్థ ఏర్పాటు చేస్తున్నట్టు సీఈఓ ఎంకే మీనా తెలిపారు.పోస్టల్ బ్యాలెట్‌పై కీలక ఆదేశాలు పోస్టల్ బ్యాలెట్ వ్యాలిడిటీ అనుమానాలపై మరోసారి సీఈఓ ముఖేష్ కుమార్ మీనా స్పందించారు. పోస్టల్ బ్యాలెట్ విషయంలో క్లారిఫికేషన్ ఇప్పటికే ఇచ్చామని చెప్పారు. సీఈఓ ఆఫీసు, ఎన్నికల సంఘం వేర్వేరు కాదని స్సష్టం చేశారు. అయితే ఒక పార్టీకి కొన్ని అనుమానాలు ఉన్నాయని.. వాటిపై కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశామని తెలిపారు. అయితే సీఈఓ మాట్లాడుతున్న సమయంలోనే పోస్టల్ బ్యాలెట్ లెక్కింపు విషయంలోని అనుమానాలకు కేంద్ర ఎన్నికల సంఘం సమాధానం పంపించింది. సీఈఓ ఇచ్చిన మెమోను ఈసీ సమర్ధించింది. కేవలం గెజిటెడ్ అధికారి సిగ్నేచర్ ఉంటే చాలని స్పష్టం చేసింది. పోస్టల్ బ్యాలెట్‌పై సిగ్నేచర్ మాత్రమే ఉండి సీలు, హోదాలు లేకపోయినా ఆ బ్యాలెట్‌ను కౌంటింగ్ సెంటర్ రిటర్నింగ్ అధికారి వ్యాలిడేట్ చేయొచ్చని సీఈఓ ఎంకే మీనా తెలిపారు.

Related posts