Praja Kshetram
తెలంగాణ

పాఠశాలలు తెరిచే నాటికి వసతులు కల్పించాలి:డీఈవో సుశీందర్‌రావు

పాఠశాలలు తెరిచే నాటికి వసతులు కల్పించాలి:డీఈవో సుశీందర్‌రావు

యాచారం, మే 30 (ప్రజాక్షేత్రం): పాఠశాలలు తెరిచేనాటికి అమ్మ ఆదర్శ పాఠశాలల్లో అన్ని రకాల వసతులు కల్పించడంపై అధికారులు దృష్టి సారించాలని జిల్లా విద్యాశాఖాధికారి సుశీందర్‌రావు అధికారులను ఆదేశించారు. గురువారం యాచారం మండలంలోని గడ్డమల్లాయాగూడ, మాల్‌ మార్కెట్‌ ప్రాథమిక పాఠశాలలను ఆయన తనిఖీ చేశారు. అమ్మ ఆదర్శ పాఠశాలలుగా ఎంపిక చేసిన ప్రతి పాఠశాలలో మౌలిక వసతులు కల్పించడంలో నిర్లక్షం చేయరాదని ఆదేశించారు. పనుల్లో కూడా నాణ్యత లోపిస్తే తగిన చర్యలుంటాయన్నారు. పాఠశాలలకు వసతులు కల్పించడం కోసం విధ్యార్థుల తలిదండ్రులు, ఉపాధ్యాయులు తగిన చొరవ తీసుకోవాలన్నారు. ప్రతి పాఠశాలను కార్పొరేట్‌కు ధీటుగా మార్చడం కోసమే అమ్మ ఆదర్శపాఠశాల కొత్త పథకం ప్రభుత్వం అమలు చేస్తుందని గుర్తు చేశారు. ప్రతి పాఠశాలలో హరితహారం కింద విరివిగా మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని ఉపాధ్యాయులను ఆదేశించారు. ఆయన వెంట ఎంఈవో వెంకటరెడ్డి, ప్రధానోపాధ్యాయులు డాక్టర్‌ జగన్నాథ్‌, శ్రీలత తదితరులున్నారు.

Related posts