Praja Kshetram
తెలంగాణ

సీడ్ డీలర్ దుకాణాలను అకస్మాత్తుగా తనిఖీలు : వ్యవసాయాధికారి సురేష్ బాబు

సీడ్ డీలర్ దుకాణాలను అకస్మాత్తుగా తనిఖీలు : వ్యవసాయాధికారి సురేష్ బాబు

శంకర్ పల్లి మే 31 (ప్రజాక్షేత్రం): శుక్రవారం శంకర్ పల్లి లోని సీడ్ డీలర్ దుకాణాలను మండల వ్యవసాయ అధికారి పి సురేష్ బాబు డిప్యూటీ తహసీల్దార్ ప్రియాంక మరియు ఎస్ఐ సంతోష్ ఆధ్వర్యంలో తనిఖీలు చేయడం జరిగింది. ఈ సందర్భంగా కాటన్ సంబంధించిన పలు కంపెనీలు మరియు పలు రకాల స్టాకులను పరిశీలించడం జరిగింది. అదే విధంగా ఏ డీలర్ అయిన విత్తనాలను ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విత్తనాలు అమ్మిన మరియు కృత్రిమ కొరత సృష్టించిన విత్తన డీలర్ పై తగు చర్యలు తీసుకోవడం జరుగుతుందని తెలిపారు.

Related posts