మతోన్మాద బీజేపీ విధానాలపై పోరాడాలి
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని .సాంబశివరావు
జఫర్ గడ్ మే 31 (ప్రజాక్షేత్రం): మతోన్మాద బీజేపీ విధానాల పై పోరాడాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు అన్నారు. శుక్రవారం జఫర్ గడ్ మండల కేంద్రంలో జనగామ జిల్లా పార్టీ రాజకీయ శిక్షణా తరగతులు ముగింపు ఆయన మాట్లాడరు. రెండు రోజుల పాటు జరిగిన ఈ శిక్షణా తరగతులలో సీపీఐ జిల్లా సమితి సభ్యులు, మండల కార్యదర్శులు, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన శిక్షణా తరగతుల ముగింపు సమావేశానికి సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ఆది సాయన్న అద్యక్షత వహించగా కూనంనేని సాంబశివరావు ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. దేశంలో ప్రస్తుత రాజకీయ పరిస్థితుల్లో వామపక్షాల బలోపేతం కావాల్సిన అవసరం ఉందన్నారు. కులం, మతం పేరుతో రాజకీయ లబ్ధి పొందాలని చూసే పార్టీలకు కాలం చెల్లిందన్నారు. లౌకిక దేశమైన భారత దేశంలో మత రాజకీయాలు, మతోన్మాద శక్తులు అంతరించిపోక తప్పదని అన్నారు. కేంద్రంలో పదేళ్ల పాటు అధికారంలో ఉన్న బీజేపీ ప్రభుత్వం కార్పొరేట్ శక్తులకు మేలు చేకూర్చేందుకే పని చేసిందని, పేదలు, మద్య తరగతి వర్గాల ప్రజల సమస్యలను పట్టించుకోలేదని అన్నారు. దళితుల, గిరిజనుల, మైనారిటీలపై బీజేపీ హయాంలో దాడులు పెరిగాయని, చివరకు రాజ్యాంగం, ప్రజాస్వామ్య వ్యవస్థలను కూడా ద్వంసం చేసే ప్రయత్నం చేశారన్నారు. కమ్యూనిస్టులు, లౌకిక శక్తులతోనే ప్రజాస్వామ్య, రాజ్యాంగ రక్షణ సాధ్యము, గడిచిన లోక్ సభ ఎన్నికలలో దేశ ప్రజలు బీజేపీ కి సరైన గుణపాఠం చెప్పబోతున్నారని అన్నారు. రానున్న రోజులలో పార్టీ బలోపేతానికి సీపీఐ, ప్రజాసంఘాల నాయకులు కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జనగాం జిల్లా కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే సిహెచ్ రాజారెడ్డి సమక్షంలో కునూర్ గ్రామం నుండి వివిధ పార్టీల నాయకులు 20 చేరారు. బుల్లె దూడయ్య షాగ యాదగిరి మరియూ చేరిన వారిలో ఉన్నారు.పాతూరి సుగుణమ్మ, ఆకుల శ్రీనివాస్, మంగళంపల్లి జనార్ధన్, జిల్లా అధ్యక్షులు మండల గట్టుమల్లు మండల కార్యదర్శి జువారి రమేష్ పెండ్యాల సమ్మయ్య రాడపక సత్తయ్య ఎండి యాకుబ్ పాషా ఎండి జఫర్ కూరపటి చంద్రమౌళి మంద బుచ్చయ్య తదితరులు పాల్గొన్నారు.