జూన్ 3 నుండి బడిబాట నిర్వహించాలి : ఎంపీడీవో జ్యోతిలక్ష్మి
సంగారెడ్డి,కొండాపూర్ మే 31 (ప్రజాక్షేత్రం):మండల కేంద్రంలో శుక్రవారం నిర్వహించిన బడిబాట సమన్వయ సమావేశంలో మండల ఎంపీడీవో జ్యోతిలక్ష్మి పలు అంశాలను చర్చించారు. సమావేశంలో ఎంపీడీవో మాట్లాడుతూ….
ఈ సంవత్సరం విన్నతంగా బడిబాట నిర్వహించాలని సూచించారు. ప్రతి హెబిటేషన్ లో బడి ఈడు పిల్లలను గుర్తించి, ప్రభుత్వ పాఠశాలలలో చేర్పించే బాధ్యతను, అందరూ సమిష్టి కృషితో చేర్పించాలని కోరారు.అంగన్వాడి కేంద్రంలో ఉన్న ఐదు సంవత్సరములు నిండిన పిల్లలను గుర్తించి ప్రాథమిక పాఠశాలలో వెళ్లే విధంగా చూడాలన్నారు. ప్రతి ఒక్కరికి మన ఊరు మరియు పాఠశాల కమిటీ ద్వారా ప్రభుత్వ పాఠశాలలో త్రాగునీరు, టాయిలెట్లు, మైనర్ రిపేర్లు, కరెంటు, అన్ని సదుపాయాలు ప్రైవేట్ పాఠశాలలకు దీటుగా ఉండాలని తెలియజేశారు. ప్రతి పాఠశాలల నుండి నిర్వహించే కార్యక్రమాలు ప్రభుత్వం అందించే ఉచిత పుస్తకాలు, నోట్ బుక్స్, రెండు జతల యూనిఫాం, మధ్యాహ్న భోజన పథకం లాంటి కార్యక్రమాలను ఫ్లెక్సీలు తయారుచేసి ర్యాలీగా ప్రతి ఇంటికి డోర్ టు డోర్ వెళ్లి విద్యార్థుల తల్లిదండ్రులకు విద్యా బోధన గురించి తెలియజేసి వారి పిల్లలను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించే విధంగా వాళ్లకు తెలియజేయాలని కోరారు. ప్రైవేటు పాఠశాలలకు వెళ్లే విద్యార్థులను గుర్తించి వారి తల్లిదండ్రులతో మాట్లాడి వారిని సైతం ప్రభుత్వ పాఠశాలకు వచ్చే విధంగా వారిని మోటివేషన్ చేయాలని కోరారు. ఈ సమావేశంలో మండల ఎంపీడీవో జ్యోతిలక్ష్మి, ఎమ్మార్వో అనిత, ఎంఈఓ భీమ్ సింగ్, ఏపిఎం సరిత, ఎంఎన్ఓ జయలక్ష్మి, కాంప్లెక్స్ ప్రధాన ఉపాధ్యాయులు ఎలిజిబెత్, మరియు టీచర్లు సమావేశంలో పాల్గొన్నారు.