గొర్రెల స్కాంలో మరో ఇద్దరు అధికారులు అరెస్ట్
రంగారెడ్డి జిల్లా మే 31(ప్రజాక్షేత్రం): గొర్రెల స్కాంలో దూకుడు పెంచారు ఏసీబీ అధికారులు. రాష్ట్ర పశుసంవర్ధక శాఖ సీఈఓ సబావత్ రాంచందర్ ను అరెస్ట్ చేశారు. ఆయనతో పాటు అప్పటి మంత్రికి ఓఎస్టీగా పనిచేసిన కళ్యాణ్ కుమార్ ను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం వీరిద్దరినీ కోర్టులో హాజరుపరిచారు ఏసీబీ అధికారులు. గొర్రెలను కొనుగోలు చేయకుండానే నకిలీ పత్రాలు సృష్టించి వాటిని పశుసంవర్ధక శాఖ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసి అవినీతికి పాల్పడ్డట్టు ఏసీబీ దర్యాప్తులో తేలింది. ఇలా మొత్తం 2కోట్ల 10లక్షల రూపాయల దాకా ప్రభుత్వ ఖజానాను కొల్లగొట్టడంలో రాంచందర్ తో పాటు కళ్యాణ్ కుమార్ ఇద్దరు అధికారులు కీలకపాత్ర పోషించారని ఏసీబీ అధికారులు గుర్తించారు.