Praja Kshetram
తెలంగాణ

ఘనంగా రాష్ట్రా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

ఘనంగా రాష్ట్రా ఆవిర్భావ దినోత్సవ వేడుకలు

 

హైదరాబాద్ మే 31 (ప్రజాక్షేత్రం): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా సికింద్రాబాద్‌లోని పరేడ్ గ్రౌండ్స్‌లో ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. జూన్2వ తేదీన రాష్ట్ర ద్విశాబ్ధి ముంగిపు వేడుకలను వైభవంగా నిర్వహించేందుకు తెలంగాణ ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది. ఉదయం, సాయంత్రం ఈ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు అధికారులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఇప్పటికే పోలీసులు రిహార్సల్స్ కూడా చేశారు. ముఖ్య అతిథులు, ప్రజాప్రతినిధులు, ఆహ్వానితులకు ప్రత్యేక లాంజ్ ఏర్పాటు చేశారు.

పరేడ్ గ్రౌండ్ మొత్తం డాగ్ స్క్వాడ్, బాంబ్ స్క్వాడ్‌లతో ముమ్మర తనిఖీలు చేశారు. ఈ వేడుకల ఏర్పాట్లను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతికుమారి, కలెక్టర్ అనుదీప్, పోలీస్ ఉన్నతాధికారులు పరిశీలించారు. రాష్ట్రా ఆవిర్భావ వేడుకలకు భారీ ఏర్పాట్లు చేస్తు్న్నామని సీఎస్ శాంతి కుమారి తెలిపారు. జూన్ 2న ఉదయం 10 గంటలకు సీఎం రేవంత్‌రెడ్డి జాతీయ పతాకాన్ని ఆవిష్కరిస్తారని సీఎస్ చెప్పారు. ట్యాంక్‌బండ్‌పై 5వేల మందితో ఫ్లాగ్‌మార్చ్ నిర్వహిస్తున్నామని ప్రజలంతా ఈ కార్యక్రమంలో ఉత్సాహంగా పాల్గొనాలని సీఎస్ కోరారు. రేపు సాయంత్రం 5 గంట నుంచి ప్రజలను ట్యాంక్ బండ్‌‌కు అనుమతిస్తారని తెలిపారు. వేడుకలకు భారీగా ఏర్పాట్లు చేశామని, ప్రత్యేక కార్యక్రమాలు చేపట్టినట్లు తెలిపారు. ఫైర్‌వర్క్స్, కార్నివాల్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. కొత్తగా నియామక పత్రాలు తీసుకున్న వారితో ఓ కార్యక్రమానికి ప్లాన్ చేసినట్లు సీఎస్ శాంతి కుమారి తెలిపారు.

Related posts