Praja Kshetram
తెలంగాణ

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి:మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ఇంద్రారెడ్డి

తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాలను విజయవంతం చేయాలి:మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి ఇంద్రారెడ్డి

 

మహేశ్వరం మే 31 (ప్రజాక్షేత్రం) : మహేశ్వరం నియోజకవర్గంలోని మండలాలు, మున్సిపాలిటీలు, కార్పొరేషన్లు, జీహెచ్‌ఎంసీ డివిజన్లలో జూన్‌ 1 నుంచి 3వ తేదీ వరకు బీఆర్‌ఎస్‌ ఆధ్వర్యంలో నిర్వహించే తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలను విజయవంతం చేయాలని మహేశ్వరం ఎమ్మెల్యే పి.సబితారెడ్డి అన్నారు. శుక్రవారం జిల్లెలగూడలోని ఎమ్మెల్యే క్యాంప్‌ కార్యాలయంలో దశాబ్ది ఉత్సవాల పోస్టర్‌ను ఆవిష్కరించారు. ఆమె మాట్లాడుతూ.. జూన్‌ 1న సాయంత్రం 6 గంటలకు రాష్ట్ర సాధన కోసం ప్రాణత్యాగాలు చేసిన అమరవీరులకు నివాళులు అర్పిస్తూ కొవ్వొత్తులతో ర్యాలీ, 2న సాయంత్రం 6 గంటలకు అమరవీరుల కుటుంబాలకు, ఉద్యమకారులకు సన్మానాలు, 3న ఎవరి ప్రాంతాల్లో వారు జాతీయ జెండాల ఆవిష్కరణలు, ఆస్పత్రుల్లో, అనాథాశ్రమాల్లో పండ్లు, స్వీట్లు పంపిణీ చేపట్టాలన్నారు. ఉత్సవాల విజయవంతానికి బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో హాజరుకావాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. కార్యక్రమంలో బీఆర్‌ఎస్‌ నాయకులు ఎం.నవీన్‌, కె.ప్రభాకర్‌, డి.కృష్ణ పాల్గొన్నారు.

Related posts