గన్‌పార్క్ చుట్టూ ఇనుప కంచె
గన్ పార్క్ జూన్ 01 (ప్రజాక్షేత్రం):తెలంగాణ అమరవీరుల స్థూపం ఉన్న హైదరాబాద్‌లోని గన్‌పార్క్ వద్ద శుక్రవారం ఇనుప కంచె మొలిచింది.ఓకవైపు జూన్ 2న జరుగనున్న తెలంగాణ దశాబ్ది ఉత్సవాలకు అమరుల స్థూపాన్ని ముస్తాబు చేస్తూనే.. మరోవైపు ఎన్నడూ లేనివిధంగా గన్‌పార్క్ చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం వివాదాస్పదం అవుతున్నది.