నేడు గ్రూప్-1 పరీక్ష హాల్ టికెట్లు విడుదల
హైదరాబాద్ జూన్ 01 (ప్రజాక్షేత్రం):
తెలంగాణలో గ్రూప్-1 ప్రిలి మినరీ పరీక్షకు టీజీపీఎస్సీ ఏర్పాట్లు ముమ్మరం చేసింది. ఇందులో భాగంగా శనివారం హాల్‌టికెట్లను విడుదల చేసింది.
జూన్ 9న ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం 1గంట జరిగే ఈ పరీక్ష రాసే అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్ నుంచి హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.
రాష్ట్రంలో 563 గ్రూప్-1 పోస్టుల భర్తీ కోసం ఫిబ్రవరి 23 నుంచి మార్చి 16 వరకు ఆన్‌లైన్లో దరఖాస్తులు స్వీక రించగా.. రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 4.03 లక్షల మంది కి పైగా అభ్యర్థులు దరఖా స్తు చేసుకున్న విషయం తెలిసిందే.
పరీక్ష రోజు ఉదయం 9గంట ల నుంచే పరీక్ష కేంద్రాల్లోకి అభ్యర్థుల్ని అనుమతించ నున్నారు. పది దాటితే పరీక్ష కేంద్రం గేట్లు మూసి వేస్తామని.. ఆ తర్వాత ఎవరినీ లోపలికి అనుమ తించేది లేదని అధికారులు స్పష్టంచేశారు…..