Praja Kshetram
తెలంగాణ

విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట

విద్యారంగానికి ప్రభుత్వం పెద్దపీట

రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి

యాచారం, జూన్‌ 01(ప్రజాక్షేత్రం): తల్లిదండ్రులు తమ పిల్లలను ఉన్నత చదువులు చదివించాలని, విద్యారంగానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తుందని రిటైర్డ్‌ ఐఏఎస్‌ అధికారి ఆకునూరి మురళి అన్నారు. శనివారం యాచారం మండలంలోని చింతపట్ల, నల్లవెల్లి గ్రామాల్లో ఆయన పర్యటించి పాఠశాలల పరిస్థితులపై ఆధ్యయనం చేశారు. ఉపాధి కూలీలు, అంగన్‌వాడీ కార్యకర్తలు, ఉపాధ్యాయులు, గ్రామస్తులతో మాట్లాడారు. ఈ సందర్భంగా విద్యారంగాన్ని మరింత పటిష్టం చేయాలంటే ఏం చేయాలని వారిని ప్రశ్నించారు. పేదలకు నాణ్యమైన విద్య అందాలంటే పాలకులు ఏం చేయాలని గ్రామస్తులను అడిగి తెలుసుకున్నారు. చింతపట్లలో మన ఊరు మనబడి కార్యక్రమంతో పాఠశాలను అభివృద్ధి చేసుకోవడం ప్రశంసనీయమని అన్నారు. ఈ సందర్భంగా స్థానిక ఉపాఽధ్యాయులను అభినందించారు. దాతలు పాఠశాల అభివృద్ధికి సహకరించడం అభినందనీయమన్నారు. వేసవిలో ప్రతీ పాఠశాలలో ఉచితంగా తరగతులు నిర్వహించి ఆంగ్లంపై ప్రతీ విద్యార్థి పట్టు సాధించేలా ఉపాధ్యాయులు చొరవ తీసుకోవాలన్నారు. వేసవి శిబిరంతో క్రీడల్లో నైపుణ్యం నేర్పడం అభినందనీయమ, విద్యావంతులు ముందుకు వచ్చి గ్రామస్థాయిలో విద్యారంగాన్ని మరింత పటిష్టం చేయడానికి ప్రణాళిక రూపొందించాలని అన్నారు. కేవలం విద్యతోనే గ్రామం, మండలం, జిల్లా, రాష్ట్రం, దేశం అభివృద్ధి చెందుతాయని, ప్రజలకు నాణ్యమైన విద్య, ఆరోగ్యం అందించడం పాలకుల బాధ్య అని అన్నారు. తాను చర్చించిన అంశాలను రాష్ట్ర ప్రభుత్వ పెద్దలకు వివరించి మీ సమస్యలను తీర్చడం కోసం చర్యలు తీసుకుంటామని చెప్పారు. కాగా, ఉపాధ్యాయులతో బోధనేతర పనులు చేపించకుండా ప్రభుత్వానికి వివరించాలని పలువురు ఆయన దృష్టికి తెచ్చారు. పర్యటనలో ప్రొ.లక్ష్మీనారాయణ, ఎన్‌ఆర్‌ఐ నిర్మల, ప్రధానోపాధ్యాయుడు జగదీష్‌, ఉపాధ్యాయులు మల్లేష్‌, ఎండీ సాబేర్‌, దాస్‌, శేఖర్‌, విద్యార్థులు, తల్లిదండ్రులు తదితరులు పాల్గొన్నారు.

Related posts