తెలంగాణ ఏర్పాటు తోనే రియల్ ఎస్టేట్ రంగం రాణిస్తుంది…….
రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ సూర్యాపేట జిల్లా అధ్యక్షులు, సావిత్రి భాయ్ పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్.
సూర్యాపేట టౌన్ జూన్ 2 (ప్రజాక్షేత్రం): తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుతోనే రాష్ట్రంలో రియల్ ఎస్టేట్ రంగానికి ప్రాధాన్యత సంతరించుకుందని రియల్ ఎస్టేట్ వ్యాపార సంఘ జిల్లా అధ్యక్షులు,సావిత్రి భాయ్ పూలే జాతీయ విశిష్ట సేవ అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ తన అభిప్రాయాన్ని వ్యక్త పరిచారు. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆదివారం జిల్లా కేంద్రం నుండి ఆయన విడుదల చేసిన ఒక ప్రకటనలో మాట్లాడారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం అమరవీరుల త్యాగాల ప్రతిఫలమే నేటి తెలంగాణ రాష్ట్రం తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం జూన్ 2 సందర్భంగా రాష్ట్ర ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు ఉమ్మడి రాష్ట్రంలో అణచివేత నిర్బంధం బానిసత్వం నిరాధారణను నిరసిస్తూ ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర సహకారమే లక్ష్యంగా తొలి మలిదశ ఉద్యమాల్లో ప్రాణార్పణ చేసిన అమర వీరులు తెలంగాణ ప్రజల గుండెల్లో గుడి కట్టుకున్నారు. అని అన్నారు. తెలంగాణ రాష్ట్రం దశాబ్ది ఆవిర్భావ ఉత్సవాలు జరుపుకుంటున్న వేళ ప్రజలు వారి త్యాగాలను స్మరించుకుంటారని తెలిపారు. అదే మాదిరిగా ప్రజలకు ఉచిత విద్య వైద్యము నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు ఇవి ఇస్తే చాలు ప్రభుత్వాలు ఉచిత పథకాలు రద్దు చేస్తే మన రాష్ట్ర ప్రభుత్వం బాగుపడుతుంది. తెలంగాణ అన్ని రంగాలల్లో అభివృద్ది పథం లో దూసుకుపోతుoదని హితువు పలికారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పాటైన 33 జిల్లాల ఫలితం గానే ఆయా జిల్లాలో నూతన ప్రభుత్వ భవన నిర్మాణాలు జరిగాయి.ఇందువల్ల రియల్ ఎస్టేట్ వ్యాపార రంగం కూడా ఒక్కసారిగా అభివృద్ధి పథంలో ముందుకు దూసుకెళ్తుందని చెప్పారు. ముఖ్యంగా సూర్యాపేట జిల్లాలో కూడా నూతన కలెక్టరేట్, ఎస్పీ ఆఫీసు,మినీ ట్యాoక్ బండ్,మోడరన్ మార్కెట్,మెడికల్ కాలేజి భవన నిర్మాణాలు జరిగాయి అని వివరించారు. ఇన్ని ప్రభుత్వ కార్యాలయాలు జిల్లాలో ఉన్నందునే రియల్ వ్యాపార రంగం కూడా రాణిస్తుoదని కితాబిచ్చారు. ఇందులో భాగంగానే జిల్లాలో కూడా రిజిస్ట్రేషన్ కార్యాలయానికి సొంత భవన నిర్మాణం కోసం ప్రభుత్వ చొరవ చూపాలని ఆయన విజ్ఞప్తి చేశారు.