Praja Kshetram
ఆంధ్రప్రదేశ్క్రైమ్ న్యూస్

ఏఆర్ మహిళా కానిస్టేబుల్ తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య?

ఏఆర్ మహిళా కానిస్టేబుల్ తుపాకితో కాల్చుకొని ఆత్మహత్య?

 

అమరావతి జూన్ 02 (ప్రజాక్షేత్రం):

ఎపిలో ఆదివారం దారుణం చోటుచేసుకుంది. ఓ ఎఆర్ మహిళా కానిస్టేబుల్ తుపా కీతో కాల్చుకుని ఆత్మహత్య కు పాల్పడింది. ఎపిలోని అన్నమయ్య జిల్లా రాయచోటీలోని ఎస్‌పి కార్యాలయంలో ఎఆర్ మహిళా కానిస్టేబుల్‌గా పనిచేస్తున్న చిత్తూరు జిల్లా పుంగనూరుకు చెందిన వేదవతి (22) ఎస్‌పి కార్యాలయంలోని సెక్యూరిటీ గార్డ్ రూమ్‌లో తన వద్దనున్న సర్వీస్ తుపాకీతో కాల్చుకుని ఆత్మహత్య చేసుకుంది. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని పోలీసు అధికారులు సందర్శించారు. కుటుంబసభ్యులకు సమా చారమందించి, పోస్టుమా ర్టం నిమిత్తం వేదవతి మృతదేహాన్ని రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియ వలసి ఉంది.ఈ ఘటన స్థానికంగా కలకలం రేపింది. కేసు పోలీసుల దర్యాప్తులో ఉంది.

Related posts