కౌంటింగ్‌కు ఒకరోజు ముందు ఈసీ కీలక నిర్ణయం
న్యూఢిల్లీ జూన్ 2 (ప్రజాక్షేత్రం): లోక్‌సభ ఎన్నికల ఫలితాలు ఈనెల 4వ తేదీన వెలువడుతుండటంపై సర్వత్రా ఉత్కంఠ నెలకొన్న తరుణంలో ఎన్నికల కమిషన్ కీలక నిర్ణయం తీసుకుంది. సోమవారం నాడు మీడియా కాన్ఫరెన్స్ ఏర్పాటు చేయనుంది. ఎన్నికలు పూర్తయి, కౌంటింగ్‌కు ఒకరోజు ముందు ఎన్నికల కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఏర్పాటు చేస్తుండటం ఇదే మొదటిసారి.
ఎన్నికల ప్రక్రియను దెబ్బతీస్తే సహించొద్దు.. ఈసీని కలిసిన బీజేపీ ప్రతినిధి బృందం ఎన్నికల కమిషన్ ప్రెస్ కాన్ఫరెన్స్ ఎజెండా ఏమిటనేది స్పష్టంగా తెలియనప్పటికీ, ఈసారి ప్రధాన పార్టీల నేతలు కోడ్ ఉల్లంఘనలకు పాల్పడినట్టు ఫిర్యాదులు ఎక్కువగా రావడం, పోలింగ్ ముగిసిన తర్వాత కూడా పలు అవాంఛనీయ సంఘటనలు వెలుగుచూడటం ఈసీ పరిగణనలోకి తీసుకుందని తెలుస్తోంది. కౌంటింగ్ ప్రక్రియకు విఘాతం కలిగించే అవకాశాలు ఉండచ్చొనే ఫిర్యాదులు కూడా ఈసీ దృష్టికి వచ్చినట్టు తెలుస్తోంది. ఇదే సమయంలో కౌంటింగ్ ప్రక్రియ కట్టుదిట్టంగా, సజావుగా జరిగేలా చూడాలంటూ ‘ఇండియా’ కూటమి, బీజేపీ ప్రతినిధుల బృందం వేర్వేరుగా ఈసీని ఆదివారం కలవడం కూడా ప్రాధాన్యత సంతరించుకుంది. ఈ పరిణామాలను దృష్టిలో ఉంచుకునే కౌంటింగ్‌కు ఒకరోజు ముందు మీడియా సమావేశం ఏర్పాటు చేయాలని ఈసీ నిర్ణయించినట్టు తెలుస్తోంది. తప్పిదాలకు పాల్పడే పార్టీలు, నేతలపై కఠిన చర్యలు తీసుకుంటామని ప్రెస్ కాన్ఫరెన్స్‌లో ఈసీ హెచ్చరించే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.