Praja Kshetram
తెలంగాణ

ఎరువులు, విత్తనాల కొరత సృష్టించొద్దు

ఎరువులు, విత్తనాల కొరత సృష్టించొద్దు

 

 

చేవెళ్ల, జూన్‌ 2 (ప్రజాక్షేత్రం): ఎరువులు, విత్తనాల కృత్రిమ కొరత సృష్టించొద్దని చేవెళ్ల ఇన్‌స్పెక్టర్‌ లక్ష్మారెడ్డి అన్నారు. ఆదివారం చేవెళ్లలోని రైతు వేదికలో డీలర్లు, రైతులతో విత్తనాలు, ఎరువులు, పురుగుల మందుల అమ్మకాలు, చట్టాలపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్యాకింగ్‌ చేయకుండా లూజు విత్తనాలు అమ్మొద్దని సూచించారు. అనుమతి పొందిన కంపెనీల విత్తనాలే విక్రయించాలని, రైతులకు తప్పనిసరిగా రషీదు ఇవ్వాలని తెలిపారు. నకిలీ విత్తనాలు విక్రయించే వారిపై పీడీ యాక్టు కింద కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. దుకాణాదారులు అధిక ధరలకు ఎరువులు, విత్తనాలు విక్రయిస్తే రైతులు వ్యవసాయ శాఖ అధికారులకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి తులసి, ఏఈవోలు రమేష్‌, స్వాతి, ప్రియ పాల్గొన్నారు.

Related posts