Praja Kshetram
జాతీయం

తెలంగాణ మరింత ఉన్నత శిఖరాలకు చేరాలి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య

తెలంగాణ మరింత ఉన్నత శిఖరాలకు చేరాలి: మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య

 

హైదరాబాద్‌ జూన్ 2 (ప్రజాక్షేత్రం): తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల సందర్భంగా రాష్ట్ర ప్రజలందరికీ మాజీ ఉపరాష్ట్రపతి ఎం. వెంకయ్యనాయుడు హృదయపూర్వక శుభాకాంక్షలు తెలిపారు. మహోజ్వల చరిత, గొప్ప సాంస్కృతిక వారసత్వం ఉన్న రాష్ట్రం తెలంగాణ. సంప్రదాయ విలువలు, ఆధునికత మేళవించిన రాష్ట్రం తెలంగాణ. సుసంపన్నమైన సహజ వనరులు, అద్భుతమైన మానవ వనరులతో విభిన్న రంగాల్లో సుస్థిర అభివృద్ధికి చిరునామా తెలంగాణ రాష్ట్రం.భిన్న సంస్కృతులను, భిన్న ప్రాంతాల ప్రజలను అక్కున చేర్చుకుంటూ మినీ భారత్ లాగా విలసిల్లే తెలంగాణ రాజధాని హైదరాబాద్… భిన్నత్వంలో ఏకత్వానికి, సౌబ్రాతృత్వానికి గొప్ప ప్రతీక. భారత అభివృద్ధి పయనంలో తెలంగాణ మరింత కీలక భూమిక పోషించాలని, అభివృద్ధిలో రాష్ట్రం మరింత ఉన్నత శిఖరాలకు చేరాలని మనసారా ఆకాంక్షిస్తున్నాను.

 

Related posts