Praja Kshetram
తెలంగాణ

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు.. తృటిలో తప్పిన పెను ప్రమాదం

 

ఆదిలాబాద్‌ జూన్ 2(ప్రజాక్షేత్రం): ఆదిలాబాద్‌ జిల్లాలో ఆర్టీసీ బస్సు అదుపు తప్పి రోడ్డు కిందకు దూసుకెళ్లింది. ఈ సంఘటన జిల్లాలోని భీంపూర్ మండలంని అర్లి-ఇందూర్‌పల్లి మార్గంలో సోమవారం చోటు చేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. ఎదురుగా వస్తున్న వాహనానికి దారి ఇచ్చే క్రమంలో ప్రమాదం చోటు చేసుకుంది. ఆర్టీసీ బస్సు డ్రైవర్‌ అప్రమత్తతో ప్రయాణికులు సురక్షితంగా బయటపడ్డారు. రోడ్డు గుంతలుగా మారడం వల్లే బస్సు అదుపు తప్పడానికి కారణమని ప్రయాణికులు తెలిపారు. కాగా, తృటిలో పెను ప్రమాదం తప్పడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు.

Related posts