*ఆదమరిస్తే తాండ ప్రజల ప్రాణాలకే ముప్పు*
విద్యుత్ స్తంభంతో పొంచి ఉన్న పెను ప్రమాదం..
మిడ్జిల్, జూన్ 3 (ప్రజాక్షేత్రం): మిడ్జిల్ మండలంలోని వేముల గ్రామ పంచాయతీ పరిధిలో ఉన్న తమ్మడి కుంట తాండ మధ్యల నుంచి తండా మీదుగా వెళ్తున్న 11 కెవి విద్యుత్ స్తంభాలు బీటలు వారి ఒకవైపు ఒరిగి అత్యంత ప్రమాదకరంగా మారింది. దీంతో ఏక్షణంలో నైనా విద్యుత్ స్తంభం ఒరిగిపోయి తండా అంతటికి విద్యుత్ ప్రమాదం సంభవించే అవకాశంఉండడంతో తమ్మడి కుంట తండా గిరిజనులు తమ ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని బిక్కుబిక్కుమంటున్నారు. మిడ్జిల్ మండల పరిధిలోని తమ్ముడి కుంట తండా వద్ద ఇండ్ల మధ్యలో నుంచి 11 కేవీ హైటెన్షన్ విద్యుత్ లైన్ దశాబ్దాల కాలం నుండి వెళ్తుంది. దీంతో తండావాసులకు ఎప్పటికైనా ప్రమాదం అని ఇండ్లపై
నుండి వెళ్తున్న హైటెన్షన్ లైన్ ను పక్కకు మార్చాలని
గిరిజనులు విద్యుత్ అధికారులకు అర్జీ పెట్టుకోవడంతో అందుకు సంబంధించిన మరమ్మతులు గత వారం రోజుల క్రితం విద్యుత్ శాఖ అధికారులు చేపట్టారు. తండాకు కొన్ని ఇండ్లకు సమీపం నుంచి మార్చారు. కానీ మార్చిన స్తంభాలు అన్ని బేస్ పగుళ్లు వచ్చాయి. దీంతో స్తంభాలను ఒకవైపు ఊరికి ఉన్నాయి. దీంతో 11 కెవి విద్యుత్ వైర్లు ఏ క్షణంలోనైనా తండాలోని ఇండ్లపై తెగిపడే అవకాశం పొంచి ఉంది. అదే జరిగితే తండాలోని గిరిజనులకు పెను ప్రమాదం సంభవించే అవకాశం ఉంది. గత వారం రోజుల క్రితమే విద్యుత్ స్తంభాల మరమ్మతులు చేయించిన విద్యుత్ శాఖ అధికారులు నాసిరకంగా పనులు చేపట్టడం తోనే వారం గడవకముందే 11 కెవి విద్యుత్ స్తంభాలు పగుళ్లు వచ్చి ఒకవైపు ఒరగాయని ఇందులో విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం స్పష్టంగా కనబడుతుందని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఘోర ప్రమాదం సంభవించక ముందే విద్యుత్ శాఖ అధికారులు వెంటనే స్పందించి ఒరిగిన స్తంభాలను మరమ్మతులు చేసి తమ్మడి కుంట తండా గిరిజన ప్రజల ప్రాణాల కాపాడాలని తండావాసులు విద్యుత్ శాఖ అధికారులను వేడుకుంటున్నారు. ఇప్పటికైనా అధికారులు తక్షణమే స్పందించి ఒరిగిన పోల్స్ ని సరి చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది.