పిడీఎస్ బియ్యం పట్టివేత..!
నారాయణపేట జిల్లా జూన్ 2 (ప్రజాక్షేత్రం):కొడంగల్ నియోజకవర్గం, మద్దూరు మండలం ఎలాంటి ప్రభుత్వ అనుమతులు లేకుండా పిడిఎస్ రైసును నూకలుగా మార్చి ఇతర ప్రాంతాలకు మరియు వేరే రాష్ట్రాలకు లారీ ద్వారా తరలిస్తున్నారని సమాచారం రాగా వెంటనే లారీని మరియు బొలెరో వాహనాన్ని తనిఖీ చేయగా సుమారుగా155 నూకలతో బస్తాలు కలిగిన ప్రభుత్వ కూపను బియ్యాన్ని గుర్తించి స్వాధీనం చేసుకొని పంచనామ ఆధారంగా కేసు నమోదు చేయనైనది అట్టి లారీ డ్రైవర్ గొల్ల ఓబులేషు,కర్నూలు జిల్లాకు సంబంధించిన లారీలో లోడ్ చేసుకొని పోతున్నాడు మరియు స్థానికంగా ఉండే మహమ్మద్ గౌస్ఉద్దీన్ బొలెరో వాహనాన్ని నడుపుకుంటూ శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర ట్రేడర్స్ రైస్ మిల్లు ఓనర్ అయిన గోపాల్ శెట్టి గ్రామం మద్దూరు ప్రజల వద్ద నుండి ప్రభుత్వ కూపన్ బియ్యాన్ని నూకల రూపంలో మార్పించుకొని ప్రభుత్వ అధికారులు పట్టుకోకుండా అధిక ధరలకు అమ్మితే లాభార్జన రాబట్టుటకు ఇట్టి ప్రభుత్వం కలిగిన నూకల బియ్యాన్ని వివిధ రాష్ట్రాలకు అమ్ముతున్నాడు.