Praja Kshetram
పాలిటిక్స్

శంకర్‌ పల్లి లో బిజెపి నాయకుల సంబరాలు

శంకర్‌ పల్లి లో బిజెపి నాయకుల సంబరాలు

 

శంకర్‌ పల్లి జూన్ 4 (ప్రజాక్షేత్రం): చేవెళ్ల ఎంపీగా బిజెపి అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి భారీ మెజార్టీతో గెలుపొందారు. మంగళవారం శంకర్‌ పల్లి మండల కేంద్రంలోని పురవీధుల గుండా ర్యాలీ నిర్వహించారు. అనంతరం ప్రధాన చౌరస్తాలో బిజెపి నాయకులు టపాసులు కాల్చి, మిఠాయిలు తినిపించుకొని సంబరాలు చేసుకున్నారు. కార్యక్రమంలో ఎంపీపీ గోవర్ధన్ రెడ్డి, మండల పార్టీ అధ్యక్షుడు రాములు గౌడ్, మున్సిపల్ అధ్యక్షుడు సురేష్, సీనియర్ నాయకులు ప్రభాకర్ రెడ్డి, పరమేశ్వర్ రెడ్డి, మున్సిపల్ ఇన్చార్జి వాసుదేవ్ కన్నా, మాజీ ఉపసర్పంచ్ దండు సంతోష్ కుమార్, సురేష్, రాజ్ కుమార్, రవీందర్ రెడ్డి, విశ్వనాథ్, గోవింద్ రెడ్డి, సతీష్ రెడ్డి, సాయికిరణ్ రెడ్డి, శ్రీకాంత్, శ్రీనివాస్, భరత్ రెడ్డి, అజయ్ గౌడ్, రాజేశ్వర్, శ్రీనివాస్, విజయ్, వీరేందర్, రఘువీర్, ప్రశాంత్ పాల్గొన్నారు.

Related posts