Praja Kshetram
పాలిటిక్స్

కౌంటింగ్ మధ్యలోనే వెనుతిరిగిన కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి

కౌంటింగ్ మధ్యలోనే వెనుతిరిగిన కాంగ్రెస్ అభ్యర్థి రంజిత్ రెడ్డి

 

చేవెళ్ల జూన్ 04 (ప్రజాక్షేత్రం): చేవెళ్ల పార్లమెంట్ నియోజకవర్గం పై బీజేపీ, కాంగ్రెస్, బీఆర్ఎస్ పార్టీలు తమ అభ్యర్థులే గెలుస్తారని నాయకులు తెలిపారు. అంతేకాకుండా అభ్యర్థుల గెలుపు కోసం మూడు పార్టీల నాయకులు విస్తృతంగా ప్రచారం చేశాయి. బీఆర్ఎస్ అధిష్టానం పార్లమెంట్ నోటిఫికేషన్ విడుదలైన తర్వాత అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డిని ప్రకటించింది. ఆ తర్వాత జరిగిన రాజకీయ పరిణామాలతో రంజిత్ రెడ్డి కాంగ్రెస్ అభ్యర్థిగా బరిలో నిలిచారు. అయితే బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డితో కాంగ్రెస్ అభ్యర్థి గడ్డం రంజిత్ రెడ్డి పోరాడి ఓడిపోయాడు. కౌంటింగ్ ప్రారంభం నుంచి బీజేపీ అభ్యర్థి రౌండ్ రౌండ్ కు లీడ్ ఇస్తూ ముందంజలో నిలిచారు. కాంగ్రెస్ అభ్యర్ధి గడ్డం రంజిత్ రెడ్డి 7వ రౌండ్ కౌంటింగ్ పూర్తి నాటికి పరిస్థితిని గమనించి కౌంటింగ్ కేంద్రం నుంచి వెనుతిరిగి వెళ్లిపోయారు కౌంటింగ్ కేంద్రం నుంచి బయటికి వచ్చిన రంజిత్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ… ప్రజల తీర్పును గౌరవిస్తాం… తన
కోసం శ్రమించిన ప్రతి కాంగ్రెస్ కార్యకర్త, నాయకులకు ధన్యవాదాలు తెలిపారు. చేవెళ్ల పార్లమెంట్ అభ్యర్ధిగా గెలిచిన కొండా విశ్వేశ్వర్ రెడ్డికి రంజిత్ రెడ్డి
శుభాకాంక్షలు తెలిపారు.

Related posts