చేవెళ్ల ఎంపీగా కొండా విశ్వేశ్వర్ రెడ్డి ఘన విజయం
సమీప కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి పై లక్ష 1, 79,021 మెజార్టీతో గెలుపు
చేవెళ్ల జూన్ 04 (ప్రజాక్షేత్రం): చేవెళ్ల బీజేపీ ఎంపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్ రెడ్డి విజయం సాధించారు. దాదాపు 1 లక్ష 79,021 ఓట్ల మెజారిటీతో ఆయన విజయాన్ని కైవసం చేసుకున్నారు. కొండా విశ్వేశ్వర్ రెడ్డికి ప్రధాన పోటీగా కాంగ్రెస్ అభ్యర్థి డాక్టర్ గడ్డం రంజిత్ రెడ్డి ఉండగా… ఆయనపై విజయం సాధించారు. బిఆర్ఎస్ నుంచి కాసాని జ్ఞానేశ్వర్ పోటీ చేశారు. దీంతో బీజేపీ శ్రేణులు నియోజకవర్గంలోని ఐదు మండలాల్లో సంబరాలు జరుపుకున్నారు. అనంతరం ఎంపీ కొండా విశ్వేశ్వర్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ భారీ మెజార్టీతో గెలిపించిన చేవెళ్ల పార్లమెంటు ప్రజలందరికీ రుణపడి ఉంటానని అన్నారు. తన గెలుపును ప్రజల విజయంగా అభివర్ణించారు. ఆయనకు సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలిపారు. ఎలాంటి సమస్య ఉన్నా నిత్యం అందుబాటులో ఉండి ప్రజల సమస్యలు పరిష్కరిస్తానని అన్నారు. మూడోసారి కేంద్రంలో నరేంద్ర మోదీ ప్రధాని అవుతారని ధీమా వ్యక్తం చేశారు.