ఆర్టీసీ బస్సును ఓవర్‌టేక్ చేసిన వ్యక్తి మృతి
*బస్సులో 30 మందికి పైగా ప్రయాణికులు*
*బస్సు డ్రైవర్‌కు స్వల్పగాయాలు*
బంట్వారం,కోట్‌పల్లి జూన్ 4 (ప్రజాక్షేత్రం): కోట్‌పల్లి నుంచి వికారాబాద్ వైపు బైక్‌పై వెళ్తుతున్న వ్యయ్తి ఆర్టీసీ బస్సును ఓవర్‌టెక్ చేయబోయి పడటంతో తీవ్రగాయాలపాలై మృతిచెందాడు. ఈ ఘటన మండల పరిధిలోని లింగంపల్లి గ్రామ సమీపంలో మంగళవారం చోటు వేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్టీసీ బస్సు కోటపల్లి నుంచి వికారాబాద్‌కు వెళ్తోంది. ఈ క్రమంలో వెనుక నుంచి బైక్‌పై వెళ్తున్న అంజయ్య బస్సును ఓవర్ టేక్ చేయబోయాడు. ఈక్రమంలో బస్సు డ్రైవర్ అప్రమత్తమై బైక్‌ను తప్పించబోయాడు. అయితే ప్రమాదవశాత్తు బస్సు పక్కనే ఉన్న కల్వర్టు పై నుంచి రోడ్డుపక్కకు దూసుకెళ్లింది. ఈ క్రమంలో బైక్‌పై ఉన్న వ్యక్తి బస్సుకింద పడి తీవ్రగాయాలపాలయ్యాడు. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం ఇచ్చారు దీంతో వారు అక్కడికి చేరుకుని అంజయ్యను చికిత్స నిమిత్తం 108 అంబులెన్స్‌లో తాండూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అయితే మార్గమధ్యలోనే అంజయ్య ప్రాణాలు వదిలాడు. మృతుడి మామ మహేష్ పిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తునట్లు కోట్‌పల్లి ఎస్‌ఐ స్రవంతి తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కుటుంబసభ్యులకు అప్పగిస్తామని ఆమె తెలిపారు.
*‘ఉపాధి’ పనికి వెళ్లి కూలీ..*
బొంరా్‌సపేట్: ఉపాధిహామీ పనికి వెళ్లిన ఓకూలీ మృతి చెందాడు. ఈ ఘటన దుద్యాల మండల కేంద్రంలో జరిగింది. దుద్యాల గ్రామానికి చెందిన గొల్ల లక్ష్మయ్య(48) మంగళవారం ఉపాధి పనులకు వెళ్లగా ఒక్కసారిగా బీపీ లెవల్స్ పడిపోవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన తోటికూలీలు చికిత్సనిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతిచెందాడు. ప్రభుత్వం తమను ఆదుకోవాలని మృతుడి కుటుంబసభ్యులు కోరారు. మృతుడికి భార్య, కూతురు, కుమారుడు ఉన్నారు.