Praja Kshetram
తెలంగాణ

విశ్వేశ్వర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

విశ్వేశ్వర్‌రెడ్డికి శుభాకాంక్షలు తెలుపుతున్న ఎమ్మార్పీఎస్‌ నాయకులు

 

తాండూరు /శంకర్ పల్లి జూన్‌ 5 (ప్రజాక్షేత్రం): చేవెళ్ల లోక్‌సభ స్థానం నుంచి భారీ మెజార్టీతో గెలుపొందిన బీజేపీ అభ్యర్థి కొండా విశ్వేశ్వర్‌రెడ్డిని ఎమ్మార్పీఎస్‌ నాయకులు శుభాకాంక్షలు తెలిపారు. బుధవారం ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధ్యక్షుడు కొడిగంటి మల్లికార్జున్‌ మాదిగ ఎమ్మార్పీఎస్ రంగారెడ్డి జిల్లా ఉపాధ్యక్షులు కాడిగల్ల ప్రవీణ్ కుమార్ గారి ఆధ్వర్యంలో హైదరాబాద్‌లోని విశ్వేశ్వర్‌రెడ్డి నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా విశ్వేశ్వర్‌రెడ్డి వారితో మాట్లాడుతూ బీజేపీ గెలుపు కోసం కృషిచేసిన ఎమ్మార్పీఎస్‌ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగకు, గడపగడపకూ బీజేపీ కోసం ప్రచారం చేసిన ఎమ్మార్పీఎస్‌ నాయకులకు, కార్యకర్తలకు ఆయన ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ఎమ్మార్పీఎస్‌ ఆశయ సాధనకు తన, అలాగే పార్టీ సహకారం ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ జిల్లా అధికార ప్రతినిధి ప్రకాష్‌, ఎం ఎస్ పి జిల్లా ఉపాధ్యక్షుడు పి.నర్సింహులు, కొడిగంటి మల్లికార్జున్‌, శంకర్ పల్లి మండల అధ్యక్షులు బండ్లగూడెం శ్రీనివాస్ మాదిగ హరిష్, శ్రీకాంత్, నాయకులు తదితరులు పాల్గొన్నారు.

Related posts