పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలను నాటాలి: శంకర్‌పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్
శంకర్ పల్లి జూన్ 05 (ప్రజాక్షేత్రం): పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరు బాధ్యతగా మొక్కలను నాటాలని శంకర్ పల్లి మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ అన్నారు. బుధవారం ప్రపంచ పర్యావరణ దినోత్సవం సందర్భంగా మున్సిపల్ పరిధిలో మున్సిపల్ కమిషనర్ శ్రీనివాస్ సిబ్బందితో కలిసి మొక్కలు నాటి నీరు పోశారు.ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ రానున్న భావితరాలకు మనం ఇచ్చే మంచి బహుమతి మొక్కలను పెంచడమేనని అన్నారు. మొక్కలను నాటి వాటిని సంరక్షించాలన్నారు. కార్యక్రమంలో మేనేజర్ అంజని కుమార్, శానిటరీ ఇన్స్పెక్టర్ అశోక్, ఆనంద్, చంద్రశేఖర్ ఉన్నారు.